Online Puja Services

అయ్యప్పకు యాలకుల దండ ఎందుకు?

3.147.47.177
స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప
  
 
శబరిమలై లో స్వామివారికి పుష్పాభిషేకం చేస్తున్నప్పుడు అక్కడ తాంత్రికులు ఏళ్కకాయలదండను స్వామి మెడలో వేస్తారు.  యాలుకల దండను స్వామికి సమర్పించుట వలన ఏ ఏ ఫలితాన్ని పొందవచ్చును తెలుసుకుందాం. 
 
 యాలుకల దండను శబరీష్నకు సమర్పించుట వలన ఆ భక్తుల కోరికలు  నెరవేరును. అనేక శుభ ఫలితములు ఇచ్చును. అమరకోశంలో యాలుకలను( ఏళ్కకాయల) గూర్చి ఏమన్నాడంటే ? చంద్ర స్వభావేవా  పుత్రికేవా చంద్రబాల  అని చెప్పియున్నాడు. దీని అర్థం ఏమిటంటే కర్పూరమునకు కూతురువలె నుండునది అని అర్థం.
 
"బహుని ఫలానే  లాతిథి  బహుళ" అని అన్నాడు. 
 దీని అర్థం ఏమిటంటే బహు ఫలములను ఇచ్చునని  అని అర్థం యాలుకల ను గూర్చి అమరసింహుడు ఏమన్నాడంటే ?  యాలుకలు (ఎలక్కి కాయల దండ) తాపమును పోగొట్టును అన్నాడు.
 
తాపము అంటే? బాధ, కష్టము అని అర్ధాలు. ముఖ్యంగా పాపము మూడు విధాల వర్గీకరించి ఆ మూడింటిని" "తాపత్రయము" అన్నారు. అవి  
ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవిక
  అనే ఈ తాపత్రయాన్ని అధిగమించేసి బుద్ధిని వృద్ధి చేసి, సిద్ధిని చేకూర్చును అని అమరసింహుడు చెప్పియున్నాడు. ఏళ్కకాయల స్వామికి సమర్పించడం వలన అనేక విధములైన కోరికలను నెరవేర్చువచ్చునని పైన పేర్కొన్న అంశాలను బట్టి అర్థమవుతుంది. స్వామి శరణం  
  స్వామి శరణం ఈ రోజు ఉత్తర నక్షత్ర  తేదీ కాబట్టి అందరూ పుష్పములతో స్వామికి సేవ చేసుకునే స్వామి అనుగ్రహ పాత్రులు కాగలరని మనవి. 
 
 స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప
 
L.  రాజేశ్వర్ 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore