Online Puja Services

పత్ర ప్రసాదం

18.191.189.124
దేవుని ప్రసాదాలు
 
ఇవాళ మనము పత్ర ప్రసాదం గురించి తెలుసుకుందాం..దేవునికి పుష్పాలతో చేసే పూజ కు ఎంత ప్రాధాన్యత ఉందో అదే విధంగా పత్రాలతో చేసే పూజ కు కూడా అంతే ప్రాధాన్యత ఉంది..ఉదాహరణకు తులసి ఆకులతో చేయని పూజ శ్రేష్ఠం కాదని పూజా విధి విధానాలలో తెలిపారు...
 
మీరు దేవాలయాలకు వెళ్లి నప్పుడు దేవుని ప్రసాదం పూల రూపంలో ఇస్తే తలలో పెట్టుకోవచ్చు. పళ్ళను ఇస్తే తినవచ్చు .అయితే ఆకులను ఇస్తే ........ ఏమి చేయాలి???ఈ పత్రాల ప్రసాదంతో ఏ కార్యాలు జరుగుతాయి అనేదాని గురించి ఇవాళ మీకు తెలుపుతాను....

తులసి పత్రం 
తులసి పత్రాలతో పూజ చేస్తే దేవునిపై భక్తి పెరుగుతుంది.దేవుని ప్రసాదం గా తులసి ఆకుల్ని పొందితే తలచిన పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి.ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో ఎవరైతే ప్రతిరోజూ తులసి ఆకులతో సాలగ్రామ దేవతలను పూజిస్తారో వారిపై ఎటువంటి మంత్ర ప్రభావాలు, మాంత్రిక శక్తులు పనిచేయవు..
 
అన్ని సదాచారాలు లకు సాత్విక దేవతలకు తులసి ఉత్తమం. అన్ని మాంత్రిక బాణామతి ప్రయోగాలలో తెలిసి మైల ఉంటుంది.క్షుద్ర మాంత్రికుల నుంచి తీసుకున్న యంత్రాలు, మంత్రం, చక్రాలు ,నిమ్మకాయలు, తాయెత్తులు, గాజులు తదితరాలకు తులసి మొక్క లేదా తులసి దళం తగిలితే అవి తమ ప్రభావాన్ని చూపలేవు....
 
 
 
 
 
దవన పత్రం 
ఏ పూజ అయినా సరే మనం చేస్తున్న సమయంలో మనకు కావలసిన ఫలం(ఫలితం) సకాలంలో లభించినప్పుడు మనిషి దేవునిపై నమ్మకం కోల్పోతాడు.అయితే దేవుడి గురించి నిర్దిష్టమైన పూజ చేసే సమయంలో క్రమబద్ధంగా భక్తితో ఇంటి వారందరూ కలిసి లేదా ఏకాంతంగా చేసే పూజలు తప్పనిసరిగా ఫలాన్ని(ఫలితం), వర ప్రసాదంగా పరిణమించి అందరి దేవుళ్ళ ఆశీర్వాదం లభిస్తుంది...
 
అయితే మండల పూజలలో, వ్రతాలలో, చాలా ప్రత్యేక పూజలు చేసే వారికి చేయించిన వారికి దవన పత్రం మంచి ఫలితాలను ఇస్తుంది..
దవన పత్రంతో చేసే పూజలతో కార్యసిద్ధి లాభం కలుగుతుంది..
 
శ్రీ గణేశునికి దేవుని పత్రంతో పూజ చేస్తే లేదా చేయిస్తే ఇద్దరికీ అన్ని పనులలో కార్యసిద్ధి లభిస్తుంది ..భవిష్యత్తులో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తవు..
 
మరుగ పత్రం 
ఎవరైతే దేవునికి మరుగ పత్రంతో పూజలు చేస్తారో వారికి శాశ్వత పదవి లభిస్తుంది..-ఎవరైతే జీవితంలో బాగా శ్రమిస్తారు వారు మరుగ పత్రంతో పూజ చేస్తే జీవితం లో ఖ్యాతిని పొందుతారు..-తాత్కాలికంగా పనిచేసే వారు దేవునికి మరుగ పత్రంతో పూజ చేయడం వలన శాశ్వత పదవి లభిస్తుంది..-పెళ్లి కానీ అబ్బాయి లేదా అమ్మాయి లకు ఎంత చూసినా వివాహం నిశ్చయం కాకపోతే అటువంటి వారు శ్రీ గణపతి కి మరుగ పత్రంతో పూజ చేసి నైవేద్యం పెట్టి పూజిస్తే అటువంటి వారికి త్వరగా వివాహం అవుతుంది. దోషాలు తొలిగిపోయి దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది..-పనులలో సమస్యలు ఆటంకాలు ఎదురవుతున్నా వారు మరుగ పత్రాలతో పూజ చేస్తే తమకు ఉన్న ఉద్యోగాల లో ఉండే సమస్యలు నివారణ జరిగి అన్ని పనులు నిరాటంకంగా జరిగిపోతాయి..
 
 
 
 
బిల్వపత్రం 
బిల్వపత్రం గురించి ఎంత చెప్పినా సరే అది తక్కువే అని చెప్పవచ్చు.. శివుని దేవాలయాలలో బిల్వపత్రం లేకుండా పూజలు చేయరు..
తిరుపతి తిరుమల దేవాలయం లలో ఉండే శ్రీ వేంకటేశ్వరునకు ప్రతిరోజు అష్టోత్తర పూజలు చేస్తారు శ్రీనివాస అష్టోత్తరం లో """శ్రీ బిల్వార్చన ప్రియాయై నమః ""అని ఉండడం ఒక సారి గమనించండి..
 
బిల్వపత్రం శివుని ఒక్కడికే కాదు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన దే. శ్రీనివాసుడిని వెంకట ,ఈశ్వర= వెంకటేశ్వరుడని అన్ని చోట్ల వైదికంగా శాస్త్రాల్లో తెలిపారు ..
 
బిల్వపత్రం తో ఈశ్వరుడినైన విష్ణువును అయినా లేదా దుర్గాదేవికి పూజ చేస్తే (జ్యోతిషశాస్త్రంలో పేర్కొన్నట్లు పూజలు చేస్తే )వారికి జీవితంలో వచ్చే ఏడవ శనైశ్చర, అష్టమ శని దోషాలు తొలగి తత్వజ్ఞానంలో మనసు లీనం అవుతుంది.. అన్ని కష్టాలు నివారించ బడతాయి. దేవుని అనుగ్రహం కూడా ఉంటుంది..-ఎవరు దోష కాలాన్ని ఎదుర్కొంటుంటారు వారి శివుని బిల్వపత్రం తో స్తుతించి పూజిస్తే వారికి మూడు జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి...
-బిల్వ పత్రాలతో దేవికి అష్టోత్తరం లేదా పూజలు చేస్తే ఇష్టార్థం నెరవేరుతుంది....-బిల్వ వృక్షానికి ప్రతిరోజు పన్నీరు వేసి ఆ చెట్టు ని పెంచితే వారికి దారిద్ర్యం, దుఃఖం ,అప్పుల బాధ నుంచి విముక్తి లభిస్తుంది...-బిల్వపత్రం తో శ్రీ మహాలక్ష్మీ దేవి పూజలు చేసి వారి ప్రసాదం స్వీకరిస్తే వారికి దరిద్రం కాదు...-వైభవలక్ష్మికి బిల్వపత్రం తో పూజ చేసి సుమంగళులకు, బ్రాహ్మణులకు తాంబూలంతో పాటు బిల్వ దళాలను దానం చేస్తే ఇంట్లో ఉన్న రుణ బాధ, రోగ బాధ, నిత్య దారిద్య్రం తొలిగిపోతుంది..బిల్వపత్రం అన్ని పత్రాలలో చాలా శ్రేష్టమైనది పూజలలో చాలా పవిత్రమైనది...
 
శమీ పత్రం 
శమీ పత్రంతో పూజ చేస్తే లభించే ఫలితాలు
-శమీ పత్రంతో శ్రీ లక్ష్మీ నారాయణ దేవునికి పూజిస్తే జీవితంలో శాంతి ప్రశాంతత లభిస్తాయి...
-శమీ పత్రంతో గణపతి పూజ చేస్తే అన్ని రకాల శనైశ్చరుల ఏడున్నర సంవత్సరపు వేధింపులు, పంచమ, అష్టమ తదితర దోషాలు నివారించబడతాయి...
-శమీ పత్రంతో దుర్గాదేవికి పూజ చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈశ్వరుడిని శమీ పత్రంతో పూజిస్తే నరాలకు సంబంధించిన వ్యాధులు త్వరగా తొలగిపోతాయి..
-శమీ పత్రంతో నవగ్రహ దేవతలను ఆరాధించడం వలన అన్ని రకాల గ్రహ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది..
-శ్రీ చక్రానికి భిన్న పత్రం లేదా శమీ పత్రంతో పూజ చేస్తే జన్మజన్మల నుంచి వెంటాడుతున్న పాపాలు తొలగిపోతాయి..
ఈ పూజ చేయాలన్నా పూజా విధానాన్ని తెలుసుకొని లేదా తెలిసిన వారి సూచనల మేరకు పూజ చేస్తే మంచి ఫలితం లభిస్తుంది....
 
కుశ పత్రం 
 
కుశ పత్రంతో ఏ దేవునికి పూజ చేసిన అన్ని రకాల పితృకర్మ దోషాలు పరిహారమవుతాయి... ఉష పత్రంతో కొన్ని దోషాలను తొలగించవచ్చు..
 
నక్షత్ర రీత్యా సంబంధిత దోషాలు ఉంటే జీవితంలో సంతోషం, ప్రశాంతత లు ఉండవు... ఇటువంటి వాటికి ఎటువంటి శాంతులు చేసినా ప్రయోజనం కనిపించదు ‌‌ అటువంటివారు కుశ పత్రం లేదా దర్భలను స్నానం చేసే నీటిలో వేసి తలంటు స్నానం చేస్తే నక్షత్ర రీత్యా ఉన్న దోషాలు తొలగిపోతాయి.. జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత కలిగి జీవిస్తారు.. సంసారం సుఖంగా సాగుతుంది..
 
గరిక పత్రం 
గరిక పత్రంతో శ్రీ మహా గణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా, అనుకూలంగా అవుతాయి..
 
-గరిక గడ్డి నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది...
-గణపతికి శనీశ్వరుడికి ప్రతిరోజూ గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్చరుని సమస్యల నుంచి బయటపడతారు..
-దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే మీరు చేసే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి...
-గరికతో చేసిన అంజనాన్ని ప్రతిరోజూ ధరిస్తే అన్ని పనులు నెరవేరుతాయి..
-గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు దైవసన్నిధిలో పూర్తిగా నెరవేరుతాయి.. గరిక రసం తాగితే దేహంలోని సమస్త వ్యాధులు నయం అవుతాయి..
 
-పాటలీపత్రం
పాటలీపత్రం తో మీ కుల దేవతను పూజిస్తే మీకు తీర్థయాత్ర ఫలం, పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం లభిస్తుంది..
 
బృహస్పతి పత్రం
 
బృహస్పతి పత్రంతో ఈశ్వరునికి పూజ చేస్తే మీరు అనుకున్న పనిలో విజయం సాధిస్తారు..
 
సింధువాక పత్రం 
సింధు వాక పత్రంతో దుర్గాదేవికి పూజ చేస్తే మీరు ప్రయత్నిస్తున్న పనుల్లో జయం పొందుతారు...
పూజా సమయంలో పలు రకాల పత్రాలను ఉపయోగిస్తారు .అయితే అన్ని రకాల ఆకులతో పూజించడం సాధ్యం కాదు. నగరాలలో అన్ని రకాల పత్రాలను లభించవు .లభించే చోట వివిధ పత్రాలతో పూజ శ్రేయస్కరం..
 
 
 
 
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore