తిధులు.. చూసుకోవాలా
రుద్రాభిషేకం చేయించేటప్పుడు తిధులు..
చూసుకోవాలా..!!
ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర
దీర్ఘవ్యాధులవారు తమ వ్యాధులు పోవాలనీ, మిగతావారు కోరికలతోనూ, భక్తితోనూ,
శివునికి రుద్రాభిషేకం చేయిస్తారు.
ఇలా చెయ్యటం వల్ల మరణ భయం పోతుందని
పురాణ ఆధారము.
రుద్రాభిషేకం చేయించేవారు ఓ ముఖ్య విషయం గుర్తుపెట్టుకొని ఆపై అభిషేకం చేయించాలి. రుద్రాభిషేకమును శివసంచారము తెలుసుకొని చేయించుకోవాలి.
మహాశివుడు శుభస్థానములో ఉన్నప్పుడే లెక్కించుకొని రుద్రాభిషేకం చేయించుకోవాలి.
శివపూజ చేసే తిథిని 10తో హెచ్చవేస్తే అనగా
"0" చేర్చి 7తో భాగిస్తే "1" వస్తే కైలాసమున,
"2" వస్తే పార్వతీదేవి వద్ద,
"3" వస్తే వాహనుడై ఉన్నట్టు,
"4" వస్తే కొలువు తీరినట్లు,
"5" వస్తే నైవేద్యము స్వీకరిస్తున్నట్లు,
"6" వస్తే ఆనంద నాట్యము చేస్తున్న సమయముగా,
"7" వస్తే స్మశానమున ఉన్నట్టు తెలుసుకోవాలి.
7-14 తిథులలో పూజ తగదు.
వివరంగా తెలుసుకొని అభిషేకం చేయించుకోవాలి.
రుద్రాభాషేకం..
లింగాకృతిలో ఉండే శివుడి మీద. .
అంటే రుద్రుడికి అభిషేకించడం రుద్రాభిషేకం అంటారు .
పదమూడు అనువాకాలు కలిగిన.
నమకం పఠిస్తూ..చేసే రుద్రాభిషేకం రుద్రం అంటారు.
పదకొండు సార్లు చేస్తే ఏకాదశ రుద్రాభిషేకం.
దీనిని " రుద్రి " అని కూడా అంటారు .
పదకొండు ఏకాదశ రుద్రాభిషేకాలు.
11 × 11 = 121. చేస్తే..
అది లఘు రుద్రాభిషేకం అవుతుంది.
పదకొండు లఘురుద్రాలు చేస్తే..
121 × = 11 = 1331.చేస్తే..
అది మహారుద్రం అవుతుంది .
అలాంటి మహారుద్రాలు..
1331 × 11 = 14,641.
పదకొండు చేస్తే..అది అతిరుద్రం అవుతుంది .
శివుడి మహా మంత్రాలు..!!
కపాలీ-
ఓం హుమ్ హుమ్ శత్రుస్థంభనాయ హుమ్ ఓం ఫట్
పింగళ-
ఓం శ్రీం హ్రీం శ్రైం సర్వ మంగళాయ పింగళాయ ఓం నమః
భీమ-
ఓం ఐం ఐం మనో వాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం
విరూపాక్ష-
ఓం రుద్రాయ రోగనాశాయ అగచ చ రామ్ ఓం నమః
విలోహిత-
ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రైం సంకర్షణాయ ఓం
శశస్త-
ఓం హ్రీం సాఫల్యాయి సిద్ధయే ఓం నమః
అజపాద-
ఓం శ్రీం బం సో బలవర్ధనాయ బలేశ్వరాయ రుద్రాయ
ఫట్ ఓం
అహిర్బుధన్య-
ఓం హ్రైం హ్రీం హుమ్ సమస్త గ్రహదోష వినాశయ ఓం
శంభు -
ఓం గం గ్లామ్ శ్రౌం గ్లామ్ గమ ఓం నమః
చంద-
ఓం చుమ్ చండేశ్వరాయ తేజశ్యాయ చుమ్ ఓం ఫట్
భవ- ఓం భవోద్భవ శంభవాయ ఇష్ట దర్శన హేతవే ఓం సం ఓం నమ:
ఇవి చాలా మహిమగలవి.
ఈ మంత్రాలను రోజుకు 108 సార్లు చొప్పున.. మహాశివరాత్రి నుంచి 40 రోజుల పాటు జపిస్తే..
విశేష ఫలితం ఉంటుంది.
మిగతా రోజుల్లో ఉదయం 9 సార్లు,
సాయంత్రం 9 సార్లు వీటిని ఉచ్చరిస్తే
ఉన్నత పదవులు..ఇష్ట కామ్యాలు నెరవేరతాయి.
ప్రత్యేకంగా శివరాత్రి రోజున జపిస్తే మహారుద్ర యాగం చేసిన ఫలితం దక్కుతుందని పండితులు చెప్తున్నారు.
-
రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి