Online Puja Services

గోళ్ళు పెంచుకుంటే ఏమవుతుంది ?

3.135.214.175

గోళ్ళు పెంచుకుంటే ఏమవుతుంది ?
లక్ష్మీ రమణ 

ఆదివారం మనందరికీ శలవు . ఇంట్లో ఏమీ పొద్దుపొడు అనుకోవడానికి వీలులేదు . ఆరోజే వ్యక్తిగతమైన అన్నిపనులూ పూర్తి చేసేసుకోవాలి . లేదంటే, సోమవారం నుండీ యధావిధిగా కొనసాగే ఆఫీసు ఒత్తిడిలో చాలా పనులు చేసుకోవడానికి అస్సలు కుదరదు మరి . అందుకే మా అన్నయ్య చక్కగా టీవీ ముందర కూర్చిని , గోళ్లు కత్తి  రించుకుంటున్నాడు .  బామ్మగారు వత్తులు చేసుకుంటున్నారు . ఆవిడ కన్నుకి మా అన్నగారి పని కనిపించింది . నఖములు వాటి విశేములగురించి మా బామ్మో వాచ ఇదీ !! 

ఒరేయ్ చదివేస్తే ఉన్నమతి పోయిందని, నడిఇంట్లో కూర్చొని ఆ పనులేమిట్రా ! నీ తలకాయ ! గోళ్లు తీసుకోవడానికి వేళాపాళా ఉండక్కర్లా ! గొల్లని అలా ఇంట్లో కూర్చొని తీసుకోమని చెప్పిందేవర్రా నీకు అంటూ గయ్యిమని లేచింది మా బామ్మ ! ‘ గోళ్ళకి కూడా గొడవేమిటే, అయినా తీసుకుంటే ఏమవుంది చెప్పు ‘ అన్నాడు బిక్కముఖంఎసుకొని మా అన్నగారు .  

‘మానవ శరీరంలోని చేతి , కాలి వేళ్ళకున్న గోళ్ళు విషపూరితమైనవి . మనం భోజనం చేసేటప్పుడు పొరపాటున గోళ్ళ ముక్కలు అన్నం ద్వారా లోపలి వెళ్లినా, అవి జీర్ణం కావు . వాటిని అరిగించుకొనే శక్తి మన జీర్ణవ్యవస్థకి ఉండదు. విసర్జించేటప్పుడు ప్రేగులకి ఇత్యాది వాటికి తగిలితే ప్రమాదం . అందుకే గోళ్ళు ఇంట్లో తీసుకోవద్దు అని చెప్పేది ‘ . అని ఒక్కక్షణం ఆగి, ఊపిరి తీసుకొని నామీదికి కూడా దాడికి దిగింది . 

 ‘ కానీ వారానికోసారి తప్పకుండా గోళ్లు కత్తిరించుకోవాలి. నీ చెల్లెలు చూడూ  అంతేసి గోళ్లు పెంచుకొని దానికి రంగులూ అవి వేసి పోషిస్తూ ఉంటుంది. పోనీలే య్యెడమా చేతికి పెంచుకుంది అనుకుంటే, కాదు, రెండు చేతులకి గోళ్ళుంటాయి. ఆది రాక్షస ప్రవృత్తికి సంకేతం . ఆ గోళ్ళకున్న రంగు లోపలి పొతే, విషంగా మారుతుందని వాళ్ళ అమ్మ నెత్తీ  నోరూ బాదుకుంటే , వింటోందా ఏమన్నానా !

పైగా ఆ గోళ్ళు కొరికే  ఆలవాటొకటి ! ఇటువాంటి చర్యలు రాక్షసగుణాన్ని ప్రేరేపిస్తాయి . దానికి , తోడు గోళ్ళలోని మట్టీ , క్రిములూ హాయిగా మనలో ప్రవేశించి మనలో అశాంతిని కలిగిస్తాయి . ధర్మశాస్త్రాలు గోళ్ళు కొరుక్కోవటం అనే అలవాటు మిక్కిలి దరిద్రహేతువని శెలవిస్తున్నాయి. న నఖేనా అని చెబుతుందది రా శాస్త్ర్రం  ‘. ఇప్పటికన్నా ఆ దరిద్రమైన అలవాట్లని మానుకొని సవ్యంగా ఉండడం నేర్చుకోండి రా నాయనా  !! మీరు  ఇంకా ఇలాగే ఉంటె, రేపు  మీ పపిల్లలకి ఏం నేర్పిస్తారు ?’ అంటూ మెత్తగా వడ్డించింది మా బామ్మ . 

‘పడే ఆనాలుగు అక్షింతలూ మీ బామ్మచేత్తో  వేస్తేగానీ మీకు బుద్ధి రాదులే!’ ఆంటూ విసవిసా వంటింట్లోకి  వెళ్ళింది మా అమ్మ. నేనూ , అన్నయ్యా బుద్ధిగా బయట కూర్చొని గోళ్ళుతీసుకోవడానికి  వెళ్లాం . అంతేగా  మరి !    

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore