బంధాలు - బాధలు
ప్రతి మనిషి బందీయే బంధాలకు బాధలకు
ఏదో ఒక టైమ్ లో
ఎందుకంటె మనుషులం కదా
ఎన్నో జన్మలా కర్మ ఫలితాలు.
ఏటి మీరు చెప్పేది జన్మలు కర్మలు అటు బాధలకు ముడిపెట్టారు అంటారేమో బంధలు విలువ తెలిసినవారికి కర్మలు ఉన్నాయి అని నమ్మిన వారికీ మాత్రమే అర్ధం అవుతాయి ఈ నామాటలు.
ఆ కొందరికి చిన్న మాట. బంధాలు దూరం అయ్యాయి అని లేదా బాధపెట్టేరు అని బాధపడకండి. కలికాలం కదా అలాగే ఉంటారు అడుగడుగునా మనసు లేని మనుషులు. అసలు అయినా ఎందుకు బాధ చెప్పండి. నాడు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలే నేడు బంధం తెంచుకొని వెళ్ళిపోయే రోజులివి. భగవంతుడు కలిపినా బంధాలు నిలుస్తయా చెప్పండి.
నేను చెప్పేది ఏటి అంటే మనసున్న పిచ్చి తల్లుల్లారా పిచ్చి తండ్రుల్లారా.. బంధాలు అటు వాటి గురించి అస్తమాను ఆలోచిస్తూ ఉన్న ఈ చిన్న జీవితం దుఃఖ భరింతం చేసుకోకండి.
మీ తప్పు లేకుండా మిమ్మల్ని బాధపెట్టినా
వదిలి వెళ్లినా బాధపడకండి. వారికీ మీ విలువ,
మీ ప్రేమ, అభిమానం తెలియజేయటానికి కాలం అనేది ఒకటి ఉంది కచ్చితంగా వారికీ తెలియజేస్తుంది.
అసలు ఈ జీవితం ఏటో ఈ బంధలు ఏటో
మన జీవితంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుస్తారో మనకే తెలియని ఒక చిత్రమైన విషయం.
అయితే మీరు తెలుసుకోవలసిన అంశం ఏమిటంటే దీని వెనుక ఉండి నడిపించేవాడు
ఆ నటన సూత్రదారి మన తండ్రి పరమశివుడే.
శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా,
ఆ విధంగా ఒకరికి మరొకరికి బంధాలను, స్నేహాలను కలిపేది ఆ శివయ్యే అదే బంధాలను కాలగర్భంలో కలిపేసేది శివయ్యే
మనిషి జీవితంలో ఒక వస్తువు కాని, ఒక మనిషి కాని, ఒక జంతువు కాని పూర్వ ఋణము వుంటేనే తప్ప ఏవీ కూడా మన దరికి చేరవు. పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి, రుణాన్ని బట్టి ఈ జన్మలో భార్య కాని, భర్త కాని వివాహబంధంతో ఏకమవుతారు, బంధు బంధం తో బంధుఘనాలు, మిత్రబంధంతో స్నేహబంధాలు ఏర్పడతాయి.
అలాగే దంపతులకు పిల్లలు పుట్టాలన్నా గతజన్మలో వారి ఋణము మనకు వుండాలి. ఇక మన ఇంట తిరిగే పశువులు, ఏ ఇతరాలైనా కూడా ఋణము వుంటేనే తప్ప మన దరికి చేరవు,
ఆ బుణం తీర్చుకోవడానికే వారు మనకు చేరువైతారు...
అలాగే ఋణము వుంటేనే తప్ప ఎవరితోనైనా స్నేహాలు, బంధువులనే బాంధవ్యాలు కలుస్తాయి, అలాగే మనకు ఎవరైనా కొత్త వారు ఎదురుపడినా, పరిచయం ఏర్పడినా, లేక మాట కలిపినా కూడా ఇవన్నీకూడా ఋణానుబంధమే....
అలాగే గతజన్మ ఋణాను బంధం అనేది లేకుంటే ఎవరినీ మన కలలో కూడా మనం చూడలేము, అయితే ఇక ఈ రుణం అనేది తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మనతో నిలవరు. ఏదో ఒక కారణంతో మనతో శాశ్వతంగా విడిపోతారు.....
కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఋణాను బంధం విలువ తెలుసుకుని మసలుకోవాలి. ఈ ఋణబంధం అనేది కేవలం ధనం వరకు మాత్రమే కాదు, బాంధవ్యం కూడా, అందుకే ధన బంధం కంటే ఈ ఋణబంధానికి మనం ప్రాధాన్యత ఇవ్వలి. "మానవతా విలువలు మరచిపోతున్న ఈ సమాజంలో ఋణబంధం విలువ ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.....
కాబట్టి ఫ్రెండ్స్ ఋణం లేనిదే త్రుణం కూడా మనకు ముట్టదు అని మన పెద్దలు చెప్పారు కదా ! ఇది నిజం. మనం ఎంత యత్నించినా కూడా రుణం లేకపోతే ఏది జరగదు, మీ జీవితంలో ఏ బంధం నిలువదు, మీ నుండి ఏ బంధమైనా తెగిపోయినా, లేదా ఎవరైనా మిమ్మల్ని వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా మీరు బాధపడకండి అంతే కాదు ఎదుటి వారిని నిందించకండి ఆ బంధం అంత వరకే అని అర్థం చేసుకోండి. వారు మీ నుండి దూరమై దూరంగా ఉన్నా, వారు మన వాళ్లేగా ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా అనుకుంటూ, వాళ్ల సంతోషం కోరుకోండి. మీరూ సుఖంగా ఉండండి, ఎదుటి వారిని సుఖంగా జీవించ నివ్వండి.
బంధాలు కల్పించేదీ, కాలగర్భంలో కలిపేసేదీ
ఆ శివయ్యే అనేది గుర్తించు కోండి. మన బిడ్డలు తప్పు చేయకుండా మనం దండిస్తాం కదా.
అలాగే ఆ తండ్రి మన కర్మలు బట్టే ఈ బంధాలు
అటు బాధపడేలా చేస్తాడు.
ఈ జన్మలో ఎవరికీ ఋణం లేకుండా ఎవరిని బాధపెట్టాకుండా మంచి పనులు చేస్తే అవి మంచి కర్మలు అవుతాయి వచ్చే జన్మలో బాధలు లేకుండా చక్కని జీవితం ప్రసాదిస్తాడు లేదా జన్మ లేకుండా మోక్షం ఇస్తాడు తండ్రి పరమేశ్వరుడు
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి
- బి. సునీత