Online Puja Services

మన భారతీయులు వ్రాసిన అపూర్వ శాస్త్రాలు

3.12.163.14

భారతీయ సనాతనం

నేడు అమలులో లేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు: నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద? క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.

అక్షర లక్ష : ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రి కోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం, జలయంత్ర శాస్త్రం, గాలి, విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

శబ్దశాస్త్రం : రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది.ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం, వాటి పిచ్(స్థాయి),వేగాలను కొలవడం వివరించారు.

శిల్పశాస్త్రం : రచయిత కశ్యపముని. ఇందులో 22 అధ్యాయాలు ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి,101రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు.గుళ్ళు,రాజభవనాలు,చా వడులు మొదలైన  నిర్మాణవిషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం పై విశ్వామిత్రుడు,మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

సూపశాస్త్రం : రచయిత సుకేశుడు.ఇది పాకశాస్త్రం.ఊరగాయలు, పిండివంటలు తీపిపదార్థాలు,108 రకాల వ్యంజనాలు మొదలగు అనేకరకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలం లో వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

మాలినీ శాస్త్రం : రచయిత ఋష్యశృంగ ముని.పూలమాలలను తయారుచేయడం,పూలగుత్తులు,పూలతో రకరకాల శిరో అలంకరణలు,రహస్యభాషలో పూవులరేకుల పైన ప్రేమసందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు 16 అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

ధాతుశాస్త్రం :రచయిత అశ్వినీకుమార. సహజ, కృత్రిమ లోహాలను గురించి 7 అధ్యాయాలలో కూలంకుషంగా వివరించారు. మిశ్రమలోహాలు,లోహాలను మార్చడం,రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

విషశాస్త్రం : రచయిత అశ్వినీకుమార. 32 రకాల విషాలు,వాటి గుణాలు,ప్రభావాలు, విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

చిత్రకర్మశాస్త్రం(చిత్రలే ఖనశాస్త్రం) : రచయిత భీముడు.ఇందులో 12 అధ్యాయాలు ఉన్నాయి. సుమారు 200 రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని, గోటిని కాని, ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.

మల్లశాస్త్రం : రచయిత మల్లుడు. వ్యాయామాలు, ఆటలు, వట్టిచేతులతో చేసే 24 రకాల విద్యలు చెప్పబడ్డాయి.

రత్నపరీక్ష : రచయిత వాత్సాయన ఋషి.రత్నాలు కల్గిఉన్న 24 లక్షణాలు చెప్పబడ్డాయి. వీటిశుద్దతను పరీక్షించడానికి 32 పద్దతులు చెప్పబడ్డాయి.రూపం, బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.

మహేంద్రజాల శాస్త్రం :సుబ్రహ్మణ్యస్వామి స్వామి శిష్యుడైన వీరబాహువు రచయిత. నీటిపై నడవడం, గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

అర్థశాస్త్రం : రచయిత వ్యాసుడు. ఇందులో భాగాలు 3. ధర్మబద్ధమైన 82 ధనసంపాదనా విధానాలు ఇందులో వివరించారు.

శక్తితంత్రం : రచయిత అగస్త్యముని. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన  64 రకాల బాహ్యశక్తులు, వాటి ప్రత్యేకవినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్చేదనం ఇందులోని భాగమే.

సౌధామినీకళ : రచయిత మతంగ ఋషి. నీడల ద్వారా, ఆలోచనల ద్వారా అన్ని కంటికి కనపడే విషయాలను ఆకర్షించే విధానం, భూమి మరియు పర్వతాల లోపలిభాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

మేఘశాస్త్రం : రచయిత అత్రిముని.12 రకాల మేఘాలు,12 రకాల వర్షాలు,64 రకాల మెరుపులు,33 రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

స్థాపత్యవిద్య : అదర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కట్టడాలు, నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం, కుమారస్వామి రచించిన గజశాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి , ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద? *వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు.*


మీ శ్రుతి

- శృతి వెనుగోముల 

Quote of the day

Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend. Your grown up children are your best friends.…

__________Chanakya