Online Puja Services

ఆడపిల్ల - ఓ చిన్న కథ

18.118.11.120

మన ఇంటి 'ఆడ' కూతురు.... ఓ చిన్న కధ . చాలా బాగుంటుంది ... తన కూతురును ప్రేమించే ప్రతి తండ్రి చదవాల్సిన - అద్భుత కధ, తప్పకుండా చదవండి . 

 

అమ్మాయి పెళ్ళికై నిశ్చయ తాంబూలాలు పుచ్చుకున్నారు, ఆరోజున ! అది గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబం ఎంతో సంతోషించింది. తండ్రి శర్మగారు ఎంతగానో ఆనందించాడు. పిల్లవాడు, అతని తల్లిదండ్రులు చాలా మంచివారు. దాంతో శర్మగారికి ఎంతో భారం తగ్గినట్లనిపించింది. పెళ్ళికిముందు ఒకరోజు పెళ్ళికూతురు తండ్రి శర్మగారు వియ్యంకుడు వాళ్ళింటికి వెళ్ళాలసివస్తుంది. అయితే ఆరోజు శర్మగారి ఆరోగ్యం బాగాలేదు. మొదటిసారి కావడంతో కాదనలేకపోయాడు. వరుని తరపు వాళ్ళు ఎంతో సాదరంగా ఇంటిలోనికి ఆహ్వానించారు. కొద్దిసేపు వచ్చిన పని విషయమై మాట్లాడుతుండగానే తేనీరు వచ్చింది.

శర్మగారికి మధుమేహం ఉండడంతో చక్కెర పదార్ధాలకు దూరంగా ఉంటున్నారాయన. అయితే మగ పెళ్ళివారింటిలో శర్మగారు మొహమాటంతో ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు తాగడానికై. మొదటిగుటక వేస్తూనే ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అందులో పంచదార లేదు సరికదా, తనకిష్టమైన యాలకులపొడి వేశారు. మా ఇంటి పధ్ధతిలోనే చేసిన టీ వీరింటిలోనూ తాగుతున్నారే అని అనుకున్నారాయన. మధ్యాహ్నం భోజనం చేశారు, అదీ అచ్చు తమ ఇంటివంట లాగానే ఉంది. వెంటనే ఏం బయలు దేరుతారు, కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటూ పడకగదికి తీసుకెళ్ళారు. అచ్చటి దుప్పటి తను కప్పుకునే దుప్పటి లాగ పలచటిది. కునుకుతీసి లేచేటప్పటికి రాగి చెంబులో నీరిచ్చారు తాగడానికి. బయలుదేరేముందు ఇక అడగకుండా ఉండలేకపోయేరు శర్మగారు...'నేను ఏం తింటాను, ఎలా తాగుతాను, నా ఆరోగ్యానికి ఏది మంచిది ... ఇవన్నీ మీకెలాతెలుసు?' అని. 

 

అమ్మాయి అత్త గారు ఇలా అంది.... 'నిన్నరాత్రి మీ అమ్మాయి ఫోన్ చేసి మీగురించి అన్నీ చెప్పింది. మా నాన్నగారు మొహమాట పడతారు. వారి గురించి మీరే శ్రధ్ధ తీసుకోవాలని కోరింది.' శర్మగారి కళ్ళల్లో నీరు తిరిగాయి. శర్మగారు ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు... 'లలితా, మా అమ్మ చనిపోలేదు.' 'ఏవిటండీ మీరు మాటాడుతున్నది' 'అవును లలితా, నన్ను కంటికి రెప్పలా చూసుకొనే నా తల్లి బతికే ఉంది.. నా కూతురు రూపంలో' అని జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పారు శర్మగారు కన్నీరు నిండిన కళ్ళతో. అమ్మాయి 'ఆడ'పిల్ల అనుకొంటాము, మన ఇల్లు వదిలి పోతుందని. తను ఎక్కడికీ పోదు,తలిదండ్రుల హృదయాలలోనే ఉంటుంది.

 

 

సేకరణ 

Quote of the day

Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend. Your grown up children are your best friends.…

__________Chanakya