Online Puja Services

బొట్టు ఎందుకు దరించాలి ?

18.118.30.137
జైశ్రీరామ్ నాకు చాలా మంది అడుగుతుంటారు అన్నా నీ మొఖం కి ఎప్పుడు బొట్టు పెట్టుకొని ఉంటావని బొట్టు అంటే ఏంటో పూర్తిగా చదవండి నా మొఖం కి 24 గంటలు బొట్టు ఉంటది పవర్ ఏంటో కింద చదవండి.

 బొట్టు ఎందుకు దరించాలి ?

హిందూ ధర్మం లో తిలక ధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భ్రూ మధ్యములొ ధరించే ఈ కుంకుమ వల్ల కొన్ని నాడులు ఉత్తేజితము అవుతాయి అని శాస్త్ర పరిశోధనలలో తేలింది కూడా. అలాగే ఎదుటివారు మన ముఖము చూడగానే కనిపించే ఈ కుంకుమ వల్ల దృష్టి దోషం కూడా ఉండదు అని చెపుతారు.

కానీ మనం ఎం చేస్తున్నాం? అత్యంత ముఖ్యమైన తిలకాన్ని పెట్టుకోవడం మానేస్తున్నాం. ఫాషన్ అంటూ నుదుటిన బొట్టు లేకుండానే బయటికి వెళ్ళిపోతున్నాం. మగవారైనా, ఆడవారైనా స్నానం చేసిన వెంటనే నుదుటిన బొట్టు ధరించాలి అని శాస్త్రం. ఇది ఎవరు పట్టించుకోవటం లేదు. పూజ చేసుకునే ముందు కాళ్ళకు పసుపు రాసుకొని కూర్చోవాలి అంటుంది శాస్త్రం. బొట్టే లేకపోతే, ఇంకా పసుపుకు స్థానం ఎక్కడ? మహా అయితే పూజ , లేదా నమస్కారం అయ్యే వరకు బొట్టు పెట్టుకొని ఇవతలకి రాగానే తుడిచెస్తున్నారు ఈకాలం అమ్మాయిలు .ఒకవేళ పెట్టుకొన్నా కనీ కనపడకుండా చిన్న నల్ల రంగు బొట్టు పెట్టుకుంటున్నారు. నల్ల రంగు బొట్టు ఎప్పుడు పెట్టుకొంటారో వారికి ఎవరు చెప్పటం లేదు.  

కొన్ని మతాలలో బొట్టు పెట్టుకునే అలవాటు లేదు. విదేశీయులు కూడా పెట్టుకోరు. వారిని అనుకరించి మనం మన పధ్ధతి మార్చుకోవడం ఎంత సబబు? ఇతర మతాల వాళ్ళు వాళ్ల అలవాట్లు, సంప్రదాయాలు వదులుకోవటం లేదే? మనకెందుకు ఆ అనుకరణ!విదేశీయులు మన భగవద్గిత, పురాణాలూ, ఇతిహాసాలలో ఉన్న గొప్పదనం గ్రహించి వాళ్ళు నేర్చుకుంటున్నారు. మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాం.

మగవారు కూడా బొట్టు పెట్టుకునే ఈ దేశంలో ఆడపిల్లలు బొట్టు మానేయటం ఎంత తప్పో ఎవరైనా అలోచించారా? అమ్మా! దయచేసి మీ పిల్లలకు  బొట్టు పెట్టుకోవడం నేర్పించండి. మీ పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. ఇది కూడా బాధ్యతగా నేర్పించండి  

నుదుటన బొట్టు పెట్టుకోవడానికి కొంతమంది,సోదరీమణులు సిగ్గు పడుతున్నారు వారి కోసం ఈ పోస్ట్ అంకితం..

మీ పటేల్ ప్రసాద్
శాంభవి హీరా బెన్ పటేల్


*భారత్ మాతాకి జై*
*జై శ్రీరామ్ జైజై హింద్*

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore