వైద్యో నారాయణో హరిః
సర్జరీ కోసం ......ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే ఒక డాక్టర్, హడావుడిగా హాస్పిటల్ కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని, తిన్నగా సర్జరీ బ్లాక్ లోకి వెళ్ళాడు.
అక్కడ ఒక అబ్బాయి తండ్రి, గోడకు ఆనుకుని డాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాడు..
డాక్టర్ ను చూసిన వెంటనే కోపంగా "ఇంత ఆలస్యమయింది ఎందుకు?. నా కొడుకు ఇక్కడ ప్రాణం పోయే స్తితిలో వున్నాడు..... మీకు కొంచెం కూడా బాద్యత లేదా?"
డాక్టర్ చిరునవ్వుతో " సారీ! నేను హాస్పిటల్లో లేను.... బయట వున్నాను ..... ఎమర్జెన్సీ కాల్ అందుకున్న వెంటనే, నేను నాకు సాధ్యమయినంత త్వరగానే వచ్చాను.................. మరి ఇప్పుడు మీరు స్తిమిత పడి శాంతిస్తె ..... నేను సర్జరీకి వెళతా".
తండ్రి ఇంకా కోపంతో "శాంత పడాలా? నీ కొదుక్కే ఇలా జరిగివుంటే, నువ్వు శాంతంగా ఉండగలవా?"
డాక్టర్ మొఖంపై చిరునవ్వు చెరగకుండా "నేను మన పవిత్ర వేదగ్రందాలలో వున్నది ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను.... 'మనం మట్టి నుండే వచ్చాం ...మట్టిలోకే వెళ్ళిపోతాం... అది అంతా ఆ భగవంతుని మాయాలీలలు' ....... డాక్టర్స్ ఎవరూ ఎవరి జీవత కాలాన్ని పోదిగించలేరు.. వెళ్లి మీరు నీ కొడుకు కోసం దేవుణ్ణి ప్రార్ధించండి........ నేను చెయ్యవలసింది చేసి ...మేము ప్రయత్నిస్తాము".
తండ్రి కోపంతో రగిలిపోతూ "మనది కానప్పుడు ... సలహాలు ఇవ్వటం చాలా తేలికే" గొణుకుంటున్నాడు
డాక్టర్ కొన్ని గంటల తరువాత .... వచ్చి తండ్రితో "భగవంతునికి ధన్యవాదాలు... మీ కొడుకు ఇప్పుడు క్షేమమే" .. "మేరు ఎమన్నా అడగ్గాలని అనుకుంటే నర్స్ ని అడగండి" అని..... తండ్రి నుంచి సమాధానంకోసం ఆగ కుండా బయటకు వెళ్ళిపోయాడు ....
తండ్రి:"ఈ డాక్టర్ ఎందుకు అంత కఠినాత్ముదు........కొన్ని నిముషాలు ఆగివుంటే నేను నా కొడుకు గురించి అడిగివుందేవాడిని కదా"
అంటూ కామెంట్ చేస్తున్నాడు .......... అక్కడనే వున్న నర్స్ అది చూసి డాక్టర్ వెళ్ళిన కొన్ని నిముషాల తరువాత ...
నర్స్ కన్నీళ్ళతో "ఆ డాక్టర్ గారి కొడుకు నిన్ననే ఒక రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయాడు. మేము ఆయనకి సర్జరీ కోసం, ఫోన్ చేసినప్పుడు ... స్మశానం దగ్గర వున్నారు.. మద్యలో వచ్చి ఆయన మీ కొడుక్కి ట్రీట్మెంట్ చేసి, మిగిలిన దహన సంస్కారాలు పూర్తి చెయ్యటానికి .... మళ్ళా స్మశానానికే వెళ్లారు
సేకరణ