Online Puja Services

రక్త సంబంధానికి పూర్తి విలువ

18.190.219.178

రక్త సంబంధానికి పూర్తి విలువ ఇవ్వండి

1.ఒకే తల్లి కడుపున రక్తం పంచుకుని పుట్టిన వారు ఊపిరి ఆగిపోయినంత వరకు కలిసి ఉండండి. 

ఆస్తుల కోసం, అంతస్తుల కోసం చిన్న చిన్న మనస్పర్ధలను సాకుగా చేసుకొని పగలు ప్రతీకారాలు పెంచుకుని మాటలు లేకుండా దూరంగా ఉండకండి. "నాకు దక్కక పోయినా పర్వాలేదు వాడికి దక్కకూడదనే" అనే ఒక రకమైన ఈర్ష్య అసూయలు బంధాలను నాశనం చేస్తున్నాయి. 

2. పోయేటప్పుడు ఆస్తి, డబ్బు మనతో రాదని తెలిసి కూడా వాటి కోసమే ఇంకా ప్రాకులాడటం మూర్ఖత్వం. 

అభం శుభం తెలియని పసి వయసులో ఉన్న ప్రేమ ఆప్యాయత.... వయసు,అనుభవం, జ్ఞానం వచ్చాక కనుమరుగై పోతుంది. 

3. ఈ జన్మలో అన్నదమ్ములుగా అక్కచెల్లెలుగా పుట్టినవాళ్ళు మరుజన్మలో ఎవరు ఎక్కడ పుడతారు ఎవరికీ తెలియదు. 
ఒక తల్లి కడుపులో, ఒక ఇంటిలో, ఒక కంచంలో...... జీవితం మొదలుపెట్టిన తోబుట్టువులు 
అవసాన దశలో పాడి కట్టే నాటికి పక్కన లేకపోవటం అత్యంత బాధాకరం. 
అందుకే దయచేసి రక్త సంబంధాలుకు విలువ ఇవ్వండి. 
ప్రాణం ఉన్నంత వరకు ఒకరికొకరు అనురాగంతో ఆత్మీయతతో మెలగండి. 

4. మీ తోబుట్టువుల ఆత్మీయతానురాగాలు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లెల బంధాలే..... మీ పిల్లలకు ఆదర్శం కావాలి. మీరే సరిగా లేకపోతె వారి భవిష్యత్తులో కూడా బంధాలకు విలువ లేకుండా పోతుంది.

దయచేసి బంధాలను బలహీనపరచకండి

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore