Online Puja Services

రహస్య గ్రంథాలు - వాటి గురించి విశేషాలు

18.117.71.239

ప్రాచీన భారతీయ మహర్షులు రచించిన రహస్య గ్రంథాలు - వాటి గురించి విశేషాలు..

మా ప్రాచీన మహాఋషులు మహా తపస్సంపన్నులు మరియు గొప్ప విజ్ఞానములు. వారియొక్క విజ్ఞాన గ్రంథంలో భద్రపరిచారు. ప్రస్తుతం ఆయా గ్రంథాలు మనకి దొరకదు. నాకున్న పరిఙ్ఞానం మరియు కొన్ని పురాతన గ్రంధాలను పరిశోధించి వారు రాసిన గ్రంథాలు వేటికి సంభంధించినవో వాటిలో ఉన్న కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను .

* బృహదాత్ర సర్వస్వము -
ఈ గ్రంథమును భరద్వాజ మహర్షి రచించెను. ఈ గ్రంధము నందు అనేక యంత్రాల గురించి వివరంగా ఇచ్చాడు. ముఖ్యంగా "విమానధికారి" అనగా ఒక అధ్యాయం కలదు. ఇందుకోసం అనేక విమానాలు మరియు విచిత్రంగా మెలికలు తిరుగుతూ ప్రయాణించే విమానాల గురించి వివరించారు. ఈ విమానాలు ఆకాశంలో ఎగురునప్పుడు విమానాన్ని నాశనం చేసే వివిధ రకాల సూర్యకిరణాల గురించి , భయంకర వాయుగుండాల గురించి, అమిత విద్యుత్ శక్తి నుండి, అత్యుష్ణము, అతి శీతలం నుండి విమానం మరియు అందులో ప్రయాణించే వారిని రక్షించేందుకు పదమూడు రకాల దర్పణములు (అద్దములు) గురించి వివరించారు

ఇందు దుష్టశక్తులను నిరోధించి ఉత్తమ శక్తులను ఆకర్షించు దర్పణములు ఆరున్నూ, సూర్యుని నుండి రకరకాల సూర్యకిరణములు ఆకర్షించి అక్కరలేని వాటిని నిరోధించే దర్పణములు ఆరున్నూ కలవు. పదమూడొవది వివిధరకాల పొగను సృష్టించును. విచిత్రకార్యములకు ఉపయోగపడుట.

ఇప్పుడు మనం తయారుచేసే అద్దాలలో ప్రధానంగా సోడియం గ్లాసెస్, పొటాషియం గ్లాసులు మాత్రమే. కానీ మన ప్రాచీనులు అద్దం తయారుచేసే సువర్ణం, పాదరసం, అయస్కాంతం, ముత్యములు మొదలగునవి కలిపెదరు. అంతే కాకుండా కొన్నిరకాల దివ్యోషనాలు కూడా అద్దం తయారీలో కలిపేవారు.

అనేక రకాల విచిత్ర వస్తువుల గురించి కూడా ఈ గ్రంథంలో విపులంగా ఉంది.

* ఆగతత్వలహరీ - ఇంటు

వ్యవసాయం, అనేక వృక్షాల వర్ణనలు, వాటి చికిత్సా పద్దతులు కలవు. ఈ గ్రంథం అశ్వలాయన మహర్షి రచించెను..

* అవతవ ప్రకరణం -
ఈ గ్రంథమును కూడా అశ్వలాయన మహర్షి రచించారు. దీనిలో స్నానఫలాలు జలాల్లో రకాల గురించి వివరించారు.

* అండ కౌస్టం -
ఇది పరాశర కృతం. చరిత్ర బ్రహ్మాండ 
జీవకోటి విమర్శ మొదలగునవి వివరించబడినవి.

* అంశు బోధిని -
ఇది భరద్వాజ మహర్షి రాశారు. ప్రకాశవంతం (కాంతి), ఉష్ణం (వేడి), ధ్వని (ధ్వని), తంత్రీ వార్తావిధి (టెలిఫోనీ), విమాన నిర్మాణ విధి, విద్యుత్తుశక్తి ప్రయోగాలు కలవు.

* ఆకాశ తంత్రం -
ఇది భరద్వాజ మహర్షి రచించారు. ఆకాశం యొక్క 7 రకాల, ఆకాశంలో శక్తి సంయోగ విధులు, ఆకాశం నందలి అగ్ని, కాంతి, గ్రహాల కక్ష్యలు, భూములు, నదులు మొదలైనవి వాటి వర్ణనలు కలవు.

* ఋక్ హృదయ తంత్రం -
ఇది అత్రి మహర్షి కృతం. ఈ రోగములు, చికిత్సలు విశేషముగా వివరించబడిన ఉన్నాయి.

* ఔషధీ కల్ప - 
ఇది అత్రి మహర్షి కృతం. ఇందు ఔషధముల ప్రభావములు. చిరకాలం జీవించుటకు యోగులు, గులాకి యోగములు, ఆయుర్వృద్ది మొదలగునవి కలవు.

* కరక ప్రకరణము -
ఇది అంగీరస మహాముని రచించెను. దీని వలన మేఘములొని మార్పులు, జీవరాశుల ఉత్పాది విధానం, సూర్యరశ్మిలో మార్పులు మేఘములకు సంబంధము, నవరత్నములు పుట్టుక సంబంరించిన సూర్యరశ్మి విభాగాలు కలవు.

* కర్మాబ్దిసారము -
ఇది ఆపస్తంబా మహర్షిచే రచించబడెను. కర్మలు, చేయవలసిన విధులు, వాటి ప్రాముఖ్యత, వాటి ఫలములు, శారీరక, మానసిక ఫలములు మొదలైనవి కలవు.

* కౌముడి -
ఇది సోమనాథ కృంతుడు బ్రహ్మండం గురించి విపులంగా రాసి ఉన్నది.

* ఖేట సర్వస్వము -
ఇది జైమినీ మహర్షి చే రచింపబడినెను. ఇక్కడ ఆకాశ స్తంభములు, అందలి గ్రహాలక్షలు మొదలగునవి కలవు.

* ధాతు సర్వస్వము -
ఇది బోధినా మహర్షిచే రచించబడెను. ఇందులోని ధాతువులు, వాటి ఉత్పత్తులు, గనులు, గనుల నుండి
లోహములు తీయు పద్దతి, విషములు, వ్యంగ్యాలు, భస్మములు, గంధకం, పాదరసం మొదలగువాటి వర్ణన ఉండును. 

* ధూమ ప్రకరణం -
ఇది నారద మహర్షి కృతం. కొన్ని విశేషాలు ఆ ధూమం మంచిదో కాదో తెలుసుకొనుట అనగా ఆయాపదార్థాల యొక్క విషగుణములను తెలుసుకొనుట తద్వారా శరీరము, బుద్ధిని పోషించుకొనుట ఈ విషయాలన్నీ కలవు.

* నామార్థం కల్ప - 
ఇది అత్రి మహర్షిచే రచించబడెను. 84 లక్షల శక్తులు వాటి నామాలు, నామార్థాలు కలవు.

* ప్రపంచ లహరి -
ఇది వశిష్ట మహర్షి చే రచింపబడినెను. ఇలాంటి దస్త్రాలు తెరువలేక పొయాను అని చర్చ కలదు. అణువు ల విమర్శ కూడా కలదు.

* బ్రహ్మాండ సారం -
ఇది వ్యాస మహర్షిచే రచించబడెను. ఇందులోని బ్రహ్మాండ చరిత్ర కలదు.

* మేఘోత్పత్తి ప్రకరణం -
ఇది అంగీరస మహర్షి కృతం. వాటి మెదడులు, మెరుపులు, పిడుగులు మొదలగు వాటి ఉత్పత్తి వర్ణనలు కలవు.

* లోక సంగ్రహము -
ఇది వివరణాచార్య కృతం. వాటిలో 1714 భాషలు, జీవజాలములు, వాటి పుట్టుక, ఆహార నియమాలు, మతములు మొదలగు వివరములు కలవు. మొత్తం ప్రపంచం యొక్క సంగ్రహం

* లోహ తంత్రము -
ఇది శాక్తియాయన మహర్షి చే రచింపబడినెను. ఇందులో లోహత్పత్తి మొదలగు విషయాలు కలవు.

* వాయుతత్వ ప్రకరణము -
ఇది సుక్త్యాయన మహర్షి కృతం. ఇందులో 84 వేల రకాల వాయువులు, వాటి పొరలు, భూమి మీద ఆయా వాయువుల యొక్క ప్రభావములు, అవి వృక్ష సంపద పైన ఎట్స్ పనిచేయుచున్నవి? ఈ వాయువులను కనిపెట్టుటకు తగిన యంత్ర సాధనాలు మొదలగునవి కలవు.

* వైశ్వరర తంత్రము -
ఇది నారద మహర్షి కృతం. ఇది 128 రకాల అగనులు, వాటి రంగులు, గుణములు, ఉపయోగాలు, కొలతలు

* శక్తి తంత్రము -
ఇది అగస్త్య మహర్షి చేత వ్రాయబడినది. ఈ విద్యుత్ శక్తి యొక్క సర్వాకర్షణ సామర్ధ్యము, రూపాకర్షని, రసకర్షణి, గంధాకర్షణి, స్పర్శాకర్షిణి, శబ్దాకర్షిణి, ధైరకార్షనిణి, ధర్మ కర్కిని మొదలగు ముఖ్యమైన పదహారు శక్తుల వర్ణన, సెకనుకు 1, 86,000 మైళ్ళు వేగముతో ఇప్పుడు టెలివిజన్, రేడియో ప్రసారాలు ఎలా పోవుచున్నవో అదేవిధంగా పరవయుత్ శక్తి సహాయముతో రసము , గంధకం, స్పర్శము చివరికి శరీరం కూడా అంతే వేగముత ప్రయాణించగల విధివిధానాలు చెప్పెను. బహుశా వాయువేగంతో మనిషి

* శుద్ధ విద్యాకోసం -
ఇది అశ్వలాయన మహర్షి కృతం. ఇందులోని ప్రపంచవ్యాప్త నిర్ణయం కలదు.

* సమరాంశ సూత్రధారము -
ఇది భోజ మహారాజుచే వ్రాయబడినది. ఇందులోని అనేక యంత్రాలు కలవు. ఈ యంత్రాల్లో వాడే పంచభూత బీజాల విధానాలు, విమాన నిర్మాణ పద్దతులు, ద్వని (సైరన్) యంత్రము చేయు పద్ధతులు, బొమ్మలచే యుద్ధము, నాట్యము, సంగీతము, ద్వార రక్షణము మొదలైనవి విచిత్రములు కలవు.

పైన చెప్పినదే కాకుండా భరద్వాజ మహర్షి రచించిన బృహద్విమానశాస్త్రంలో అశని కల్ప, అంశుమా తంత్రం, ఉద్బిజ్జతత్వ సరీవేణము, దర్పణకల్పము, దర్పణశాస్త్రం, దర్పణ ప్రకరణం, ద్రావణ ప్రకరణం, మణికల్ప ప్రదీపిక, మణిరనాళము, మణి రత్నకరం, ముకురా కల్పము, యంత్ర కల్పము, యంత్రం కల్పతరువు, లాభదాయక ప్రకరణం, లోహ ప్రకరణం , లోహ రత్నకరం, లోహ రహస్యము, లోహ శాస్త్రము, విమాన చంద్రిక, విష నిర్ణయాధికారం, వ్యోమిన తంత్రం, శక్తి తంత్రము, శక్తి బీజము, శక్తి కౌసభం, సమ్మోహన క్రియాకాండం, సౌదామినీకలా మొదలగు 150 గ్రంథాలు కలవు. ఇదివరకే కాక అగస్టీ, అరిష్ట, అంగార, కపడి, గర్గ, గాలవ, గోబికాల, గౌతమ, నారద, పరాశర, భరద్వాజ, వశిష్ట, వాల్మీకి, వ్యాస, శౌనక, సిద్ధనాధ మొదలగు 140 మంది గ్రంథకర్తలు కలరు. ఋషులు అంటే ముక్కులు మూసిని మూలన కూర్చుని తపస్సు చేయనే వారు కాదు. వీరు గొప్ప వైజ్ఞానికులు. భారతదేశంలో అధికారంలో ఉన్న వారు తమకు సరైన దృష్టి పెట్టకపోవడం వలన ఎంతో విజ్ఞానశాస్త్రం కోల్పోతుంది. కానీ మన ప్రాచీన అర్ధము మీరు మీద మీకో ఉదాహరణ చెప్తాను. 1936 వ సంవత్సరం లో 1936 లో ముద్రించబడిన గ్రంథాల జాబితాలో "రసరత్న సముచ్ఛయం" అనే పేరుతో ముద్రించబడింది. ఒక కేటలాగ్ లాగా అది మన దేశంలో దాని విలువ 1 రూపాయి. జర్మనీ దేశంలో మా భారతీయ గ్రంథాల గురించి ఇచ్చిన కేటలాగ్ 5000 రూపాయిల చొప్పున అమ్మముడుడిది. . ఇది మన భారతీయ వైజ్ఞానిక విలువ. కానీ అది మరుగున పడుతుంది. మనం ఏనా కాపాడటం మా తరవాతి తరాలకు ఆ విజ్ఞానం అందించుటకు. ఆ గ్రంధాలన్ని ఏమైనాయి ఎక్కడ ఉన్నాయో తెలీదు వాటి విలువ తెలీకుండా పోయింది కొనే వారు చెప్పే వారు లేక ముద్రించడం కూడా ఆగిపోయింది.. మన ఋషులు మనకు ఇచ్చిన విలువైన సంపదను చాలావరకు పొగిట్టుకున్నాము

 

సేకరణ: భానుమతి అక్కిశెట్టి

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore