Online Puja Services

ప్రాచీన రసాయన విజ్ఞానం

52.15.53.236
ప్రాచీన రసాయన విజ్ఞానం

Indian Chemistry through Ages

క్రీ.పూ 1500 సంవత్సరాల నాటికే భారతావనిలో రసాయన శాస్త్ర విజ్ఞానం వెల్లివిరిసిందనడానికి అనేక ఆధారాలున్నాయి. చివరకు వాత్సయన కామ సూత్రాలు కూడా ‘సువర్ణ రత్న పరీక్ష’ వంటి రసాయన ప్రక్రియల గురించి చర్చించింది. రసాయన శాస్త్రాన్ని వారు ‘రసవిద్య’ అనే వారు. 
మట్టిని కాల్చి కుండలు చేయడం, వివిధ ఖనిజాలను, పదార్థాలను కాల్చటం, కరిగించడం, ఆవిరిగా మార్చటం ద్వారా పలు ఉపయోగాలు పొందవచ్చని అప్పటికే మనకు తెలుసు, 

అద్దాలు, రంగురంగుల అద్దాలు తయారుచేయటం కూడా మనకు ఆనాటికే తెలుసనని, చారిత్రక,పురావస్తు ఆధారాలు నిరూపిస్తున్నాయి. (రామాయణం, బృహత్సంహిత, అర్ధశాస్త్రం) హరప్పా నాగరిక జనులకు బంగారం, వెండి, కంచు మొదలైన లోహాల వాడకం తెలుసును. ఋగ్వేదంలో కూడా ఇటువంటి లోహమిశ్రమ నగల ప్రస్తావన ఉంది (ఋ. 1-122-14) (శుక్ల యజుర్వేదం 8:13) అనేక కఠినమైన పరీక్షల, పధ్ధతుల ద్వారా మాత్రమే మనం ఈ లోహాలను ఉపయోగకరంగా మార్చుకోగలం. ఆ విద్య ఆనాటికే అందుబాటులో ఉండేది. (వాత్సాయనాభ్యాసం – IV.I 47) , (రసార్నవం – 11.213.17) క్రీ.పూ. 600- క్రీ.శ. 800 మధ్య కాలం భారత రసాయన శాస్త్రానికి స్వర్ణయుగం. కౌటిల్యుని అర్థశాస్త్రం, బృహత్ సంహిత (క్రీ.శ 6 శతాబ్దం), చరకసంహిత, సుశ్రుత సంహిత (క్రీ.శ. 14వ శతాబ్దం) వంటి అనేక గ్రంధాలలో ఆనాటి రసాయన శాస్త్ర ప్రయోగాలు, పధ్ధతులు, విధానాలు ఉదహరింపబడి ఉన్నాయి. 

ప్రాచీన రసాయన గ్రంధాలు కర్తలు

నాగార్జునుడు - రసరత్నాకరము, కక్షపుట, 
తంత్రము, ఆరోగ్య మంజరి, యోగసారం, యోగాష్టకం 

వాగ్బట్ట - రసరత్న సముచ్చయం 

గోవిందాచార్యుడు - రసార్ణవము 

యశోధరుడు - రసప్రకాశ సుధాకరం 

సోమదేవుడు - రసేంద్ర చూడామణి 

‘పంచభూతాలే’ అన్నిటికీ మూలాధారం. పరమాణువులు – అణువులు, వీటి కలయికతొ ‘పదార్ధం’ ఏర్పడటం వంటి విషయాలు క్రీ.పూ. 200వ సంవత్సరానికే మనకు తెలుసును. క్రీ.పూ. 1 వ శతాబ్దంలోనే మానవ శరీరంలోని ‘రసాయన క్రియల’ గురించి మన ఆయుర్వేదం వివరించింది. 

ఇక కౌటిల్యుని అర్థశాస్త్రం (2-12-30) అనేక రకాలైన ఖనిజాలు, వాటి శుధ్ధి, ఉపయోగం, ప్రయోగశాలలు. ఇలా ఎన్నో రసాయన క్రియలు గురించి చర్చించింది. రాగి పలుకలకు బంగారు పూతపూయటం గురించి కూడా ఇది వివరించింది 

సంస్కృత, తమిళ, మరాఠీ గ్రంధాలలో ‘టపాసులు’ తయారుచేసే విధానం, అంఉలో వాడే రసాయన మిశ్రమాలశాతాలు వివరించబడి ఉంది. అవి రసోపనిసద, శుక్రనీతి మొదలైన గ్రంధాలు 

ఋగ్వేదంలో ‘కాటన్ డైయింగ్ ‘ గురించి, తోళ్ళ పరిశ్రమ గురించి, వీనిలో ఉపయోగించే రసాయనాల గురించీ వివరించబడింది. సబ్బులు, పౌడర్లు, సిరా, సుగంధద్రవ్యాలు, మత్తు పానీయాలు తయారీ గురించి మన ప్రాచీన గ్రంధాలు వివరించాయి. (గురునానక్ ప్రార్థనలు, మనుస్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి ) 
భారత వస్త్ర పరిశ్రమలో ఉపయోగించిన సహజ వర్ణాలు, రసాయనాలు ఎక్కువ నాణ్యంగా ఉండి, తక్కువ ధరకు లభించేవి. చివరికివే ఆంగ్లయులను మన దేశంతో వర్తకానికి ఆహ్వానించాయి. మెర్క్యురీ (పాదరసం) ఒక దివ్య రసాయనంగా ఆనాటివారు భావించేవారు. అనేక రకాలైన ఔషధాలలో దీనిని ఉపయోగించేవారు. పాదరసాన్ని వినియోగంలోకి తీసుకు రావటానికి ముందు ఆ ఖనిజాన్ని 18 రకాల రసాయనిక పరీక్షలకు గురిచేసి శుధ్ధిచేసేవారు. 
‘రస-రత్న-సముచ్చయ’ అనే గ్రంధం 7 వ అధ్యాయంలో, ‘రసశాల’ అనే ప్రయోగశాల యొక్క వర్ణన ఉంది. దీనిలో 32 యంత్రాలలో ప్రయోగాలు నిర్వహించే వారు. అందులో ముఖ్యమైనవి 

1. దోల యంత్రము
2. స్వేదనీ యంత్రం
3. పాటన యంత్రం 
4. అధస్పదన యంత్రం 
5. ఢేకీ యంత్రం 
6. బాలుక యంత్రం 
7. తిర్యక్ పాటన యంత్రం 
8. విద్యాధర యంత్రం 
9. ధూప యంత్రం 
10. కోష్టి యంత్రం 
11. కచ్చప యంత్రం 
12. డమరుక యంత్రం మొదలైన ఉన్నాయి

భారతీయ ‘ రసాయనిక విజ్ఞానం’ ‘తంత్రవిద్య’ ప్రేరణతో వృధ్ధి చెందింది. తంత్ర విధ్యలో సిధ్ధికోసం రెండు పధ్ధతులను అవలంబించే సంప్రధాయం ఉంది. ఒకటి – దేహసిధ్ధి, రెండు- లోహసిధ్ధి. దేహసిధ్ధిలో ‘పాదరసం’ ఉపయోగించి మానవ శరీరం లోని రోగాలను నిరోధించటం, వృధ్ధాప్యాన్ని నివారించటం, మృత్యువుని దూరం చేయటం వంటివి ఉదాహరణలు. లోహసిధ్ధిలో ఇనుము, రాగి, ఉక్కు లోహాలను బంగారు, వెండిగా మార్చి వానిద్వారా చూర్ణాలు తయారుచేసి, ఔషఢాలు తయారుచేసి, లోహసిధ్ధి ద్వారా దేహసిధ్ధి పొందటం జరుగుతుండేది. ఇవికాక మన రసాయన విజ్ఞానానికి నిదర్శనంగా నిలిచినవి, లభిస్తున్నవి, ‘ఢిల్లీ –ఇనువ స్థంభం’ , ‘పురాతన పంచలోహ విగ్రహలు’ మొదలైనవి 
పి.సి. రే రచించిన ‘హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ’ అనే గ్రంధంలో ప్రాచీన భారతీయ రసాయనిక విజ్ఞానానికి సంబంధించిన అన్ని వివరాలు మనకు లభిస్తాయి
 
రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

Treat your kid like a darling for the first five years. For the next five years, scold them. By the time they turn sixteen, treat them like a friend. Your grown up children are your best friends.…

__________Chanakya