మానవ జన్మ
అమృత వాక్కులు
మానవ జన్మ
చేతులు పనిమీద, చిత్తం దైవం మీద ఉంచేవాడు కర్మయోగి అని కృష్ణా "గీత"లో (శ్రీకృష్ణుడు) చెప్పావు. “నా మేలు నేను కోరుకోను. నా భక్తుల మేలునే నేను కోరుకుంటాను. భక్తులకు నేనే సర్వస్వం. నా భక్తులూ నేనూ వేరు వేరు కాదు” అని భాగవతంలో దుర్వాస మునితో నీవే (విష్ణువు) గదా చెప్పావు. విశ్వమంతటా నీవే ఉన్నావు. అంటే నీవు సర్వాంతర్యామివి. నేను ఆ అంతర్యామి అంశాన్ని. ఆత్మను నీవు చేసే పనిలో, నీ కార్యక్రమంలో నన్ను కూడ పాల్గొనివ్వు, నన్ను కూడ నీ పనిని కొంచెం చేయనివ్వు. అప్పుడు నీ అంశంగా ఉన్న నేను, నా మానవ జన్మ సార్థక మవుతాయి.
- బిజ్జా నాగభూషణం