మనసులో వున్న మాలిన్యం
అమృత వాక్కులు
మనసులో వున్న మాలిన్యం
కబీర్ దాస్ ఇలా అన్నారు.
1) నదిలో మునిగి స్నానం చేసి శుద్ధి అయినామనుకుంటాము. అదే నది నీటిలో 24 గంటలు వుంటున్న తాబేలు శరీరం వాసన వస్తుంది. అంటే మనం నది నీటిలో మునిగి స్నానం చేయడం వల్ల శుద్ధి కాలేదు. మన మనసులో వున్న మాలిన్యాన్ని కడిగి వేసి నప్పుడే శుద్ధులమవుతాము.
2) మనము దుఃఖం వచ్చినప్పుడు భగవంతుణ్ణి తలుస్తాము. సుఖంలో వున్నప్పుడు తలవము. అదే సుఖంలో వున్నప్పుడు భగవంతుణ్ణి తలిస్తే అసలు దుఃఖమే వుండదుగా.
3) రేపు చేసేది ఇవ్వాళ చేయి. ఇవ్వాళ చేసేది ఇప్పుడే చేయి. ఎందుకంటే చేసిన దాని ఫలం అనుభవించడానికి తర్వాత నీవు వుంటావో లేదో నీకే తెలియదు.
శాంతి లేనిదే సుఖం లేదు. దృశ్య పదార్థాలతో, విషయ భోగాలతో లభించే సుఖం నిజమైన సుఖం కానేరదని గీతాచార్యులు చెబుతున్నారు. అది ప్రతిబింబ సుఖం, క్షణిక సుఖం, దుఃఖమిశ్రిత సుఖం. ఇది కాదు మనిషికి కావలసింది. అవిచ్చిన్న, పరిపూర్ణ నిరతిశయ సుఖం. అది కావాలంటే చిత్తం లో శాంతి ఏర్పడాలి.
- బిజ్జా నాగభూషణం