ఓర్పు
అమృత వాక్కులు
ఓర్పు
అతి సున్నితమైనవి ఓర్పు, సహనం కావాలి. అవసరమైతే వాటితో మమేకమై గడపాలి. దానికి చనువు, మాలిమి కావాలి. అన్నింటిని మించి నమ్మకం కలిగేలా మసలుకోవాలి. దానికి నైపుణ్యం ఉండాలి. సమయానుకూలంగా అదిలించాలి. ఒకోసారి బెదిరించాలి. అంతలోనే బుజ్జగించాలి. అలా చేయడానికి మమకార రాహిత్య గుణం, సంయనం కలిగి వుండాలి. ఒక్కోసారి ఇన్ని భావాలూ ఒకేసారి వెంటవెంటనే ప్రదర్శించాల్సిన అవసరం కలగవచ్చు. అందుకోసం లౌక్యం తెలియాలి. చతురత ప్రదర్శించాలి. చంచల మనస్కులను సాకడం అంత సులభమైన పనేమీ కాదు. అలాంటి మనసున్న వారికే అదిసాధ్యం. ఆ లక్షణాలు సంపూర్ణంగా వున్నది ఒక్క పరమాత్మకే. మాననీయమైన మానవీయ విలువల్నీ పాటించటం ద్వారా మనిషి మనిషి అవుతాడు అని శ్రీ వాల్మీకి చెప్పాడు. మార్కండేయ మహర్షి చివరకు ఆనందమే పరబ్రహ్మ స్వరూపమని గ్రహించాడు.
- బిజ్జా నాగభూషణం