Online Puja Services

ముక్తి

3.142.52.141
అమృత వాక్కులు 
 
జ్ఞానంతో కూడిన భక్తి మాత్రమే ముక్తిని చేరుస్తుంది. ముక్తి నాలుగు రకాలు. భగవంతుడి లోకంలో, ఆయనతో పాటు జీవుడు వుండటం సాలోక్యముక్తి. పరమాత్మ చెంతనే ఉంటూ కోరుకున్నవాటిని అనుభవించడం సామీప్య ముక్తి. పరమాత్మ రూపాన్ని పొంది ఇష్టమైన వాటిని ఆస్వాదిస్తూ, ఆనందించడం సారూప్య ముక్తి. చివరగా పరమాత్మలో కలసిపోయి, జీవాత్మ తనదైన అస్తిత్వంతో వేరుగా వుంటూనే ఆనందంలో పాలుపంచుకోవడం సాయుజ్య ముక్తి. 
 
దైవత్వంలో ఎదీ మిథ్యకాదు. అన్నీ వున్నవే! పరమాత్మ ఎంత సత్యమో, ఇటు జీవుడూ, అటు జడమైన జగత్తూ అంతే సత్యం. అన్నిటిలోనూ ఆనంద స్వరూపమైన బ్రహ్మం మాత్రమే అత్యుత్తమమ్.
 
ఇహ పరమైన జంజాటం నుంచి బయట పడటానికి మనుషులు తీర్థయాత్రలు చేస్తారు. చింతలు వీడి ఆ దేవ దేవుడి చింతన చేసే ప్రయత్నమే తీర్థ యాత్ర. తీర్థ యాత్ర అసలైన అర్థం మనిషి తనలోకి తాను పయనించడం, తనలోకి తాను చూడ గలగటం. బుద్ధిని, మనసును ఆధ్యాత్మిక చేతన, చింతనలోకి ప్రవేశించేటట్లు చేయగలగటం. నైతిక ప్రవర్తనతో ధర్మబద్దమైన జీవితాన్ని సాగించాలి. మనిషి మనసులో ఉండే ఆధ్యాత్మిక పరిమళాందాన్ని ఆఘ్రాణించాలి . చూడగలగాలి, చేరుకోగలగాలి. అప్పుడు చేతనావస్థలోను, అచేతనావస్థలోనూ ఆధ్యాత్మిక చింతనే.  భగవంతుడి రూప సందర్శనమే. అది అద్భుత స్థితి. ఆధ్యాత్మిక జ్ఞానజ్యోతిని నిలుపుకున్నవారు గొప్పవారు. మనిషి ప్రయాణం - అంతర్ముఖంగా సాగాలి. మనసును ఆధ్యాత్మిక కస్తూరిలా చేసుకో గలగాలి. అప్పుడు అంతటా ఆధాత్మిక పరిమళమే.
 
- బిజ్జా నాగభూషణం 

Quote of the day

Beauty is truth's smile when she beholds her own face in a perfect mirror.…

__________Rabindranath Tagore