Online Puja Services

ఎవరు చెప్పినా వినాలి

3.149.29.98
అమృత వాక్కులు 
ఎవరు చెప్పినా వినాలి 
 
 
మనము అనుసరించాల్సినవి కొన్ని ఈ క్రింద వున్నవి .
 
1) వినదగు నెవ్వరు చెప్పిన - అంటే చిన్న పిల్లవాడు చెప్పినా వినాలి.  ఎందుకంటే ఎవరి నోట ఏ మంచిమాట వస్తుందో తెలియదుకాబట్టి. 
2) ముఖే ముఖే సరస్వతి అంటారు - ప్రతీ మనిషిలోనూ ఎదో ఒక ప్రతిభ ఉంటుంది. ఎవర్ని చులకనగా చూడవద్దు. 
3) వినే ఓర్పు లేనివాడు అజ్ఞానిగా మరియు చెప్పే ధైర్యం లేనివాడు పిరికివానిగా ప్రపంచంలో మిగిలిపోతాడు.
 4) మదం నాల్గు రకాలు -శరీర మదం, జ్ఞాన మదం, కీర్తి మదం, ధన మదం. అన్నినింటిలో ముఖ్యమైనది ధన మదం.  ఇది మనిషికి అందలాలు అందిస్తూనే అధః పాతాళానికి నెట్టుతుంది. 
5) కాంతా కాంచన చుట్టే తిరుగుతుంది ప్రపంచం - కాంత అంటే స్త్రీ, కాంచనం అంటే డబ్బు, ఈ రెండిటి చుట్టే తిరుగుతుంది. ఈ ప్రపంచం. వాటి వ్యామోహం తగ్గిన నాడు భగవంతునిపై భక్తి పెరుగుతుంది మోక్షానికి దారి ఏర్పడుతుంది.
 
 ఈ క్రింది వాటి నిర్వచన వివరంగా వ్రాసాను. 
 
1) అహంకారం - అంధుణ్ణి చేసి అజ్ఞానంలోకి నెట్టి, నన్ను మించినవాడు లేడని మనిషి వ్యక్తిత్వానికి తిలోదకాలిచ్చి, అధః పాతాళానికి చేరుస్తుంది. 2) ద్వేషం - మనిషిలో ఆనందాన్ని అంతమొందించి, మనసులో ఆవేశాన్ని రగల్చి, దేహాన్ని ఆంతరంగికంగా దహించి వేస్తుంది. 
3) కోపం - కాయాన్ని  (శరీరాన్ని) క్షీణింపచేసి, అది ఎదుటివారిని ఎదురుతిరిగేలా చేస్తుంది. 
4) అసహనం - విచక్షణా జ్ఞానాన్ని అంధకారంలోకి నెట్టి అటూ, ఇటూ, ఎటూ పోవాలో తోచక ఎదో ఒకటి చేసి, ఎదుటివారికి అర్థం కాకుండ చేసేది. 5) కామం - కన్ను మిన్ను కానకుండ శరీరాన్ని ఉత్ప్రేరణ చేసి, వాయీ వరస లెక్కచేయక, భయం, లజ్జ లేకుండ వాంఛ తీర్చుకోవడానికి పురమాయిస్తుంది.
 
 
- బిజ్జా నాగభూషణం 

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda