యోగం
అమృత వాక్కులు
యోగం
యోగం ఒక ప్రత్యేక జీవన విధానం. ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. అంతర్యామికై వెతుకులాట. దేహభ్రమలకు ప్రాపంచిక సుఖ దుఃఖాలకు అతీతమైన స్థితి. చంచల మానస వనచరాన్ని అచంచల స్థితికి తీసుకెళ్లడమే యోగ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. మనసు నిశ్చలతే కాదు పవిత్రతనూ సంతరించుకోవాలి. అపుడు మనసే మానస సరోవరం అవుతుంది. ప్రశాంతతకు, పవిత్రతకు మారుపేరవుతుంది. చిత్త వృత్తులన్నీ శాంతించిమనసు సులభంగా అంతర్ముఖమవుతుంది. మనో నిగ్రహమే యోగానికి పునాది. అపుడు పంచప్రాణాలు మనసు ఆధీనంలో ఉంటాయి. ప్రాణరక్షణకేగాక పరమాత్మతో అనుబంధానికి యోగం అవసరం. పరమాత్మను మన ప్రాణం కన్నా అధికంగా ఆరాధిస్తే అదే "ప్రాణయోగ మవుతుంది”.
ఆత్మవిశ్వాసం గల వ్యక్తి అందలాలు అధిరోహించగలడు, అది సడలిన వ్యక్తి అధః పాతాళానికి చేరుకోగలడు.
మంచిని గ్రహిచడం మానవ సంస్కారం. ఎదుటివారి హృదయాన్ని గెలవడం బుద్ది జీవి లక్షణం. రెండు పెదవులు దాటివచ్చే ప్రతి మాటా మనసుల మధ్య బంధాన్ని దృఢతరం చేయాలి.
- బిజ్జా నాగభూషణం