ఆత్మలింగ పూజ
అమృత వాక్కులు
ఆత్మలింగ పూజ
లోకంలో ప్రతి అణువు, ప్రతి జీవి పరస్పరాధారితం, పరస్పర సహకార రూపం . ప్రతి పనిని ప్రామాణిక సంకల్పంతో ప్రారంభించ వలసి ఉంది. సంకల్ప సిద్ది కావాలంటే ముందు సంకల్ప శుద్ధి కలిగి ఉండాలి. అన్నీ తెలిసిన మనిషి, జ్ఞాన సంపన్నుడైన మనిషి సంయమనంతో, సాధికారతతో దేవుడి రచనలో ప్రతి అధ్యాయంలో ప్రతమాక్షరం కావలసి ఉంది. తెలిసీ తెలియని ప్రకృతే ప్రతి జీవి భగవంతుడి చక్రచాలనంలో అప్రయత్నంగా వరస క్రమంలో నిబద్ధతతో నిలబడుతుంది. సద్గురువు అంటే ఎక్కడో వుండరు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, హితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల రూపంలోనే ఉంటారు. వారిలోని బుద్ధి చైతన్యమే గురుస్వరూపం.
ఆదే శివం. సకల జీవరాశుల్లోని చేతనే పరబ్రహ్మ స్వరూపం. దేహభ్రాంతి, దృశ్యభ్రాంతి మనిషి ఆధ్యాత్మిక అవగాహనకు అడ్డంకులవుతాయి. జీవుణ్ణి భ్రాంతులనుంచి రక్షించగలిగేది కేవలం ఆత్మజ్ఞానమే. మనలోని శాశ్వత సూక్ష్మ దేహాన్ని లింగదేహమంటారని చెబుతుంది యోగ వాసిష్టం. శివుడి నిరాకార స్వరూపమే శివలింగం. శివలింగ పూజ అంటే ఆత్మలింగ పూజే.

- బిజ్జా నాగభూషణం