కామము
అమృత వాక్కులు
కామము
ధర్మార్థ కామమోక్షాలను చతుర్విధ పురుషార్థాలంటారు. ఇవన్నీ మానవుడు సాదించవలసినవి. ఇందులో కామం కూడ ఒకటి. మరోవైపు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలను అరిషడ్వర్గాలుగా చెప్పారు. అంటే శత్రు కూటమి అని అర్థం. ఈ కూటమికి నాయకత్వం వహించేది కూడ కామమే. మరోవైపు తన విభూతుల్లో ఒకటిగా కామాన్ని పేర్కొన్నాడు భగవంతుడు. ధర్మాన్ని అనుసరించిన కామం ఎప్పుడు వాంచింప దగింది. అదే అధర్మం తో కలిస్తే అది మనిషి పాలిట శత్రువవుతుంది. కాబట్టి అలాంటి కామాన్ని విసర్జించమంటాయి ధర్మశాస్త్రాలు. మన్మథుడికే కాముడని పేరు ఉంది. మన్మథుడు అంటే మనస్సును మధించే వాడని అర్థం. అయన విష్ణువుకు మానస పుత్రుడు. ఐదుపుష్పాలు అయన వాడే బాణాలు. సుఖభోగాలు అనుభవించాల్సినవే కానీ ఆ మాయలోపడి దైవపూజను విస్మరించటం తగదని, క్షణికమైన సుఖం కోసం శాశ్వతమైన దైవ పదాన్ని వదులుకోవటం అవివేకమని శ్రీపార్వతీ పరమేశ్వరులు చెప్పారు. “మననాత్ త్రాయతే ఇతి మంత్రః”. నిరంతరం మననం చేయటం వల్ల మనల్ని రక్షించేది మంత్రం అని అర్థం .
- బిజ్జా నాగభూషణం