ఆరోగ్యమే మహాభాగ్యం
అమృత వాక్కులు
ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యాంగా వుండడం ఈ రోజుల్లో చాలా అవసరమైంది. ఎందుకంటే ఆరోగ్యాంగా వుంటే మనసుకూడ ప్రశాంతంగా వుంటుంది. ఆరోగ్యం మనసు ఇవి ఒకటికొకటి ఆధారపడి వున్నవి. మనసు బాగా లేకుంటే కూడ ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. జపాన్ వాళ్ళు మనుషులు అనారోగ్యాంగా ఎందుకు అవుతున్నారని research చేశారు. అందులో తేలింది ఏంటంటే, 50 percent మంది అనారోగ్యానికి కారణం ఆధ్యాత్మిక లోపం వల్ల, 25 percent మంది అనారోగ్యానికి కారణం మానసిక స్థితి, 15 percent మంది అనారోగ్యానికి కుటుంబ, సామాజిక కారణాలు, 10 percent మంది అనారోగ్యానికి శారీరిక కారణాలు.
అందుకని జపాన్లో ఒక హాస్పిటల్ లో 100 మంది patientల మీద test చేశారు. నెలరోజులు వారికి ఆధ్యాత్మిక మ్యూజిక్, ఆధాత్మిక ప్రవచనాలు, భక్తి పాటలు వినిపించారు. నెల రోజుల తర్వాత ఆ వంద మందిలో 25 మందికి surgery లేకుండ tabletsతో ఆరోగ్యాంగా అయ్యారు. అందుకని జపాన్ hospitals, patients treatment విధానంలో మార్పు చేశారు. హాస్పిటల్లో ఆధ్యాత్మిక మ్యూజిక్, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి పాటలు patientsకు వినిపిస్తున్నారు.
మన భారత దేశంలో సగటున అయిదు కోట్ల మంది hospitalsలో వుంటున్నారు. అంటే ఎంతమంది. అనారోగ్యం పాలవుతున్నారో చూడండి. దీనికి కారణాలు 1) కలుషిత ఆహారం తినడం 2) వాతావరణం 3) ఆధ్యాత్మిక లోపం వల్ల 4) శరీరానికి తగిన meditation, వ్యాయామం లేకపోవడం.
భరద్వాజ మహర్షి తపస్సుతో కనుకొన్నది ఏంటంటే, తపస్సు, జ్ఞానం, నిత్య వ్యాయామం, యోగాభ్యాసం, సభ్రంథ పఠనం, సతతత క్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి పాటిస్తే అనారోగ్యం పాలవరు.
అందుకని భరద్వాజ మహర్షి చెప్పినవి పాటించి ఆరోగ్యం కాపాడుకోవడం మంచిది. ఆరోగ్యమే మహాభగ్యం. ఎన్నివున్నా ఆరోగ్యాంగా లేకపోతె అన్ని బూడిదలో పోసిన పన్నీరులాంటివే.
- బిజ్జా నాగభూషణం