జీవితమే ఒక నాటక రంగం
అమృత వాక్కులు
జీవితమే ఒక నాటక రంగం
ఈ సృష్టి ఒక నాటక రంగం. జగన్నాటక సూత్రధారి పరమాత్మా. మనమందరం ఈ నాటకంలో పావులం అంటే పాత్ర దారులం. ఒక్కొక్కరి పాత్ర అవగానే నిష్క్రమిస్తారు.
అలానే ఈ జగత్తులో మనపాత్ర అవగానే ఈ జగత్తు నుండి ఈ శరీరం విడిచి వెళ్లి పోతాము ఆ పరమాత్మా ఆజ్ఞతో. ఆత్మ దేవుని నిలయం మరియు మనసు అరిషడ్వారాల నిలయం. ఆత్మ రాత్రి ఆనందంలో తెలియాడుతుంది మరియు మనసు ఆ రోజు మంచిచెడులను బేరీజు వేసుకుంటూ వుంటుంది. హృదయగుహలో పురీతత్ అనే నాడీమండలంలో ఆత్మనీడగా, ఆత్మను అనుసరించి, మనసుతో అనుసంధానమై జ్యోతి రూపంగా ప్రాణం ఉంటుందంటాయి ఉపనిషత్తులు. ఆదిశంకరాచార్య అద్వైత సిద్ధాంతంలో చెప్తాడు. జీవుడే బ్రహ్మం, బ్రహ్స్మమే జీవుడు. ఆ ఇద్దరికి తేడాలేదు. ఈ చుట్టూ కనిపించేదంతా మాయ మాత్రమే. జీవుడు అవిద్యాకారణంగా ఆ మాయను గుర్తించలేకపోతున్నాడు. జీవుడు అవిద్య నుండి బయట పడి తనను తాను తెలుసుకోగలగాలి. నువ్వు వేరు, నేను వేరు అనే సంకుచిత మార్గం నుంచి నువ్వూ నేనూ అందరమూ అన్ని ఒకటే అన్న విశాల మార్గంలోకి నడిపించారాయన. భగవంతుణ్ణి నిర్వచించాల్సి వస్తే సత్యం, జ్ఞానం, అనంతం అని వ్యాఖ్యానిస్తుంది. సనాతన ధర్మం. ఆద్యంత రహితమయిన కాలానికి ఆయన దర్శనం ఓ చిహ్నంగా చెబుతారు. అందరికి మంచి చేయడమే మానవుని కర్తవ్యం.
- బిజ్జా నాగభూషణం