వినదగు నెవ్వరు చెప్పిన
అమృత వాక్కులు
వినదగు నెవ్వరు చెప్పిన
వినదగు నెవ్వరు చెప్పిన అనే పద్ధతి పాటించాలి. ప్రతీ మనిషిలో ఎదో ఒక ప్రతిభ ఉంటుంది. ముఖే ముఖే సరస్వతి అంటారు. అంటే ప్రతి ఒక్కరి ముఖంలో సరస్వతి ఉంటుందన్నమాట. అందుకని ఎదుటి వారి మాటలు ఓర్పుతో విని అందులోని మంచిని గ్రహించాలి. ఆ మంచిని మన జీవితంలో అనునయించుకోవాలి. ఎలాగైతే హంస నీళ్లు పాలు కలసివున్న అందులోనుంచి పాలను మాత్రమే గ్రహిస్తుందో. అదే మనము అనుసరించాలి. అందరిలోంచి మంచిని గ్రహించుకోవడం అలవర్చుకోవాలి. దానివల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నం కాకుండా నివారించవచ్చు.
కృతజ్ఞత అనేది మనసుకు సంతోషాన్ని కలిగించే ఓ అనుభూతి. దీని వల్ల మనిషిలో ఆత్మ విశ్వాసం, ఉత్సాహం కలుగుతాయి. వంద అపకారాలు చేసినా రాముడు మరిచిపోతాడట. గుండెల్లో కృతజ్ఞతకు చోటిస్తే చాలు, ఈ ప్రపంచం అద్భుతంగా కనిపిస్తుంది. అందరం ఒక్కటే అన్న భావన కలుగుతుంది. అందరికీ సేవ చేయాలనే సద్భావన ఏర్పడుతుంది. ప్రకృతిలో భగవంతుడి సృష్టి సమస్తం సేవలమయం. ప్రకృతి సేవలను అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ జీవనయానం సాగిస్తున్న మనిషి ప్రకృతిని కాపాడి సమాజానికి ప్రత్యుపకారం చేయాలి.
- బిజ్జా నాగభూషణం