Online Puja Services

పాజిటివ్ వైబ్రేషన్స్

18.218.245.179
అమృత వాక్కులు
 
పాజిటివ్ వైబ్రేషన్స్ 
 
ప్రతి మనిషి ఆరోగ్యాంగా, మనసు ఆనందంగా వుండాలి. ఇది మనసు ఆలోచనా మీద ఆధారపడి వుంటుంది. మన ఆలోచనలు ఎంత positiveగ వుంటే మనలో అంత positive vibrations ఉత్పన్నమవుతాయి. ఆ positive vibrations శరీరమంతా ప్రసరించి శరీరంలో ఉత్తేజం ఉల్లాసం ఉత్పన్నమవుతాయి. అవి మనిషి మనుగడకు ఉపకరిస్తాయి. ప్రతి మనిషిలో మంచినే గ్రహించటం, ప్రతివస్తువులో వున్న అందాన్ని ఆస్వాదించటం, ప్రకృతిలో వున్న సౌరభాలని స్వాధీనం చేసుకోవటం, పంచభూతాల సేవలను తెలుసుకోవడం, 84 లక్షల జీవరాశుల ప్రత్యేకతలను జీర్ణించుకోవడం, ఈ సృష్టిలోని ప్రతి అణువు ఆపాదించు కోవటం, అసలు సృష్టికర్త నిర్మాణాన్ని చూసి పులకించటం ఇవన్ని positive ఆలోచనలు. positive vibrations శరీరంలో ఉత్పన్నం చేసి శరీరమంతా వ్యాపింపచేసి శరీరాన్ని ఆరోగ్యాంగా, మనసును ఆనందంగా వుంచుతాయి.

ఉదాహరణకు మీలో వంద positive vibrations ఉన్నాయనుకోండి. మీరు ఎవరినన్నా తిట్టారు లేక, దూషించారు లేక అవమానపరిచారనుకొండి అప్పుడు 10 nagative vibrations ఉత్పన్నమయినయనుకోండి. అప్పుడు positive vibrations వంద నుండి ఈ negative vibrations పది తగ్గి తొంబై positive vibrations వుంటాయి. ఇలా తగ్గుతూపోయి చివరికి positive vibrations ఇరవయ్యి వున్నాయనుకోండి అప్పుడు శరీరం నిస్సత్తువ అయి అనారోగ్యం పాలవడం మరియు మనసు ప్రశాంతత లేకపోవడం జరుగుతాయి. అందుకని మనము ఎప్పటికీ positive ఆలోచనలు
చేయడానికి ప్రయత్నించుకోవాలి. దానివల్ల positive vibrations ఉత్పన్నమయి ఆరోగ్యంగా మనసు ఆనందంగా వుంచుకొని ఆయురారోగ్యాలతో జీవించవచ్చు.
 
- బిజ్జా నాగభూషణం 

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda