ప్రియ వచనము
అమృత వాక్కులు
ప్రియ వచనము
యక్షుడు అడిగిన ప్రశ్నకు ధర్మరాజు సమాధానం,
యక్షుడు - ధర్మరాజా, మనుషులకు జీవితం చివరి వరకు వెంట వుండవలసింది ఏమిటి?
ధర్మరాజు - మనిషికి చివరి వరకు వెంట వుండవలసింది మనోబలం. అదే మనిషికి వెంట వుండవలసింది,
తపస్సు వల్ల తాపసి కాగలడు. యోగం వల్ల యోగిగా మారగలడు. నిరంతరం తాను సంపాదించిన జ్ఞానాన్ని సమాజ పరంగా ఆచరణలోకి తెచ్చినప్పుడే జ్ఞాని కాగలడు.
ప్రియంగా మాట్లాడితే అందరు సంతోషిస్తారు కదా, కాబట్టి అందరినీ సంతోషపెట్టగలిగే ప్రియ వచనం మాట్లాడాలి. దానికేం ఖర్చు ... అవుతుంది? వాక్కుకేమైనా దరిద్రమా? హాయిగా మాట్లాడు.
శారీరక సౌందర్యం క్షణికమైంది. కావలసింది అంతః సౌందర్యం. ధనం, పరివారం, యవ్వనం, వీటన్నిటినీ చూసి గర్వించటం తప్పు, ఇవ్వన్నీ మాయాకల్పితాలు. ఇవన్నీ ఏనాటికైనా నశించేవే. శాశ్వతమైన సౌందర్యం పరమాత్మది మాత్రమేనని గుర్తించాలి.
- బిజ్జ నాగభూషణం