ప్రేమ
అమృత వాక్కులు
ప్రేమ
ప్రేమ-ప్రతి మనిషికి వలపు, మోహం , ప్రేమ సర్వ సాధారణం.
ప్రేమ త్రిభుజం.
1) దేనిని ఆపేక్షించదు అంటే ఆశించదు.
2) ప్రేమలో భయం వుండదు.
3) ప్రేమ శక్తి వల్ల మనిషి శ్రేష్టతరమవుతాడు, సన్నిహితుడవుతాడు.
శ్రీ రామకృష్ణ పరమహంస తన కథామృతంలో మూడు రకాల ప్రేమ గురుంచి ప్రస్తావించారు.
1) సాధారణ ప్రేమ,
2) సమంజస ప్రేమ,
3) సమర్థ ప్రేమ.
1) సాధారణ ప్రేమ - దీనిలో మేము మంచిగా వుండాలి ఎదుటివారు ఏమై పోయియినా పర్వ లేదు అంటుంది.
2) సమంజస ప్రేమ - దీనిలోమేము మంచిగ వుండాలి ఎదుటివారు మంచిగ వుండాలి అంటుంది.
3) సమర్థ ప్రేమ - దీనిలో ఎదుటివారు మంచిగ వుండాలి మేము ఏమైపోయినా పర్వాలేదు అంటుంది. మన ప్రేమ సాధారణ నుంచి సమర్థ స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే మనం అంత పరిపూర్ణమైన ప్రేమమూర్తులుగా పరిణామం చెందుతున్నమాట.
నిజమైన ప్రేమతో మనిషి హృదయం స్నిగ్ధంగా, కోమలంగా రూపు దిద్దుకుంటుంది. అది ప్రేమతత్వం .
- బిజ్జ నాగభూషణం