మాట -అమృత బిందువు

అమృత వాక్కులు
మాట -అమృత బిందువు
వాక్కుకు నిలయం సరస్వతీ దేవి .నాలుక వాక్కుకు వేదిక .అందుకని నాలుక సరస్వతి దేవికి అధిష్టాన పీఠం .
వాక్కు అంటే మాట .మాట మనిషిని ఉత్తుంగ తరంగాలై
పైకి తెస్తుంది .అదే క్రింద పడిన తరంగంలా మనిషికి అదః పాతాళానికి తీసుకెళ్తుంది .
మాటలో అద్భుతమైన శక్తి వుంది .మాటలు పొందికగా చేసి మాట్లాడటం ఒక కళ .ఎంతటి చెడ్డవాడినైనా మన మంచి మాటతో మన వైపు తిప్పుకోవచ్చు .
మాటలో అత్యంత ఆకర్షణ శక్తి వుంది .మనము ఎదుటివారిమనసుకు హత్తుకునేలా మాట్లాడితే వారు ఆకర్షితులు అవుతారు .మాటల తోనే రాజ్యాలు జయించ వచ్చు .మాటలతోనే తోనే తన అనుభూతులను ఇంకొకరితో పంచుకోవచ్చు .తన సంతోషాన్ని మాటలతో ప్రకటించ వచ్చు .మన విషాదాన్ని కూడ మాటల తో ఇతరులకు వ్యక్తీకరిస్తే మన భాదను అర్థం చేసుకొని సానుభూతితో మనకు సహాయం చేస్తారు .సత్యం కూడ మాట తోనే ప్రకటితమౌతుంది .ఆలా సత్య మాట సర్వజన ప్రశంశనీయమౌతుంది .రాజకీయ వేత్తలు ఎన్నికల సమయంలో ప్రజలను మాటలతో బురిడి కొట్టించి ఓట్లుదండుకుని పదవులు స్వంతం చేసుకుంటారు .ప్రధాన మంత్రికూడా తన పక్షం వారితోనే కాకుండా ప్రతిపక్షం వారికి తన మాటలతో సంతృప్తి పరిచి వారితో తనకు సమస్య రాకుండా చూసుకుంటాడు . గురువులు బోధ మాటల ద్వార శిష్యులకు జ్ఞానమ్ కలిగిస్తాయి .
మహాకవి కాళిదాసు అన్నాడు
"ఔచిత్యం అనే తక్కడలో పెట్టి తూచినట్లు మాట్లాడటం ఓ కళ ".అని .
మాటలను నియమిత పద్దతిలో అమర్చితే అవి అసాధారణ శక్తి సమన్వితాలౌతాయి .అది మంత్రం శక్తి . అంటే మంత్రం మాటల పొందిక .
"మననాత్ త్రాయతే ఇతి మంత్రః "అని వేదాలలో వుంది .అంటే ఎప్పుడూ మననం చేస్తుంటే మంత్రం మనని రక్షిస్తుంది .అంటే మంత్రం మాటల సమూహం కాబట్టి .ఒక రకంగా చెప్పాలంటే మాటలు మంత్రరూపకంగా చెబితే అవి శక్తిని ఆపాదించుకొని మనను ముందుకు నడుపుతాయి .
మాటల వల్ల మిత్రులవుతారు ,శత్రువులు కూడా అవుతారు .మాటల వల్ల అభివృద్ధి కావచ్చు ,వినాశనం కావచ్చు అది మాట తీరు మీద ఆధారపడి వుంటుతుంది .శ్రీ చిన్న జీయరుస్వామి ,శ్రీసుందర చైతానంద స్వామి లాంటి స్వాములు మంగళ శాసనాలనే మాటల ప్రసంగాల ద్వార ప్రజలను ఆకర్షిస్తారు .మాటలతో మనము ఈ ప్రపంచాన్ని జయించవచ్చు .మానసిక వికాస వక్త శ్రీ శివ్ ఖేరా లాంటి వాళ్ళు వారి మాటలతో ఎదుటి వారిలో నిద్రాణమై వున్న శక్తిని వెలికితీసి వారిలో ఛైతన్యం నూరిపోసి వారికి స్ఫూర్తి ప్రదాతలౌతారు .మాటలను తక్కడలో పెట్టి తూచినట్టు మాట్లాడ మంటారు విజ్ఞులు .మాట పెదివి వదిలితే పృథ్వి దాటి పోగలదు .నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఒక రోగం .మాట తీరు మనిషి సంస్కారానికి సూచిస్తుంది .మాట కార్య సాధనకు పనిముట్టు .
మహాత్మా గాంధీ తన సిద్ధాంతాలను మాటల ద్వార ప్రజలకు ఉత్తేజపరిచి స్వాతంత్రం కొరకు సన్నిద్దులను
చేసారు .బాల గంగాధర్ తిలక్
గణేష్ నవరాత్రులు ప్రారంభించి దాని ద్వార ప్రజల సమూహానికి మాటలతో స్వతంత్ర భావాలు నూరిపోశాడు .
మనిషి మాటలతోనే తన ధైరం గాని ,పిరికితనం గాని ప్రస్ఫుటమౌతాయి .మనిషి మాటలతోనే తన ధర్మాన్ని
ఆచరిస్తాడు .మనిషికి మాటే విలువ నిస్తుంది .మాటే వ్యక్త్వానికి నాంది పలుకుతుంది .అదికారులు తమ మాటలతో నే వారి వారి క్రింది వారితో పని చేయించుకొని కార్యసాధన సమకూర్చుకుంటారు .మాటలతో ఆ మనిషి యొక్క జ్ఞానం ప్రస్ఫుటమౌతుంది .మనిషి మాటలతోనే ఆమనిషి శుంఠ అని కూడ నిర్ధారించ వచ్చు . "నోరు మంచిదైతే వూరు మంచిది "అని పెద్దలన్నారు .అంటే మాట మంచిదైతే వూరు మంచిదని అర్థం .
మాట మనిషియొక్క ఆయుధం .ఈ ప్రపంచంలో మనిషి గెలవడానికి ,మన్ననలను పొందడానికి ,కీర్తి ప్రతిష్టలు సాధించడానికి తోడ్పపడుతుంది .చివరికి భక్తుడు తన మాటలతో అంటే ప్రార్థనతో భగవంతున్ని ఆకర్షించి ముక్తికి కూడ అవకాశం పొందుతాడు .
మనము మంచి మాటలు పలుకుదాం మన జీవన సాఫల్యాన్ని సాధిద్దాం .
ఒక మాట -మనిషి మాటలతో విమర్శిస్తే దిగజారి పొతాడు .మనిషి మాటలతో విశ్లేషిస్తే పైకి ఎదిగిపోతాడు .
- బిజ్జ నాగభూషణం