బుద్ధి
అమృత వాక్కులు
బుద్ధి
బుద్ది వికసిస్తేనే మనసు దైవం
వైపు మరులుతుంది .అప్పుడే మనిషి అజ్ఞానమనే చీకటినుంచి వెలుగు వైపు అడుగులు వేస్తాడు .మనిషి జీవితం లో వెలుగును నింపేవాడు పరమాత్మ .అందుకే పరమాత్మను జ్యోతి స్వరూపంగా భావిస్తాం ."తమ సోమా జ్యోతిర్గమయ "అనే ఉపనిషత్తు వాక్యం కూడా అదే .
మనిషి తనకు నచ్చిన సాకార రూపాన్ని పరమాత్మకు కల్పించి ,అర్చించాలి .మనిషి చేసే జపతాపాదులతో కర్మ పాకం నశించి భక్తి పరాకాష్టకు చేరుతుంది .దీనితో పరమాత్మ సాకార అర్చనా రూపం దర్శనమవుతుంది . అప్పుడు "దేవుడు ఉన్నాడు "అనే నిశ్చయ భావన కలుగుతుంది .ఆ తర్వాత జ్యోతి రూపకంగా భావించి ధ్యానించాలి .పరమాత్మను జ్యోతి స్వరూపంగా వర్ణించింది మన వాజ్ఞ్మయం ."అంధకారానికి అతీతమైన సూర్యదీప్తితో ప్రకాశిస్తాడు పరమాత్మ "అంటుంది శ్వేతాశ్వతర ఉపనిషత్తు .ధ్యానం లో మనసు స్థిర పడితే పరమాత్మ తేజోమయ రూప దర్శన మవుతుంది .
ఒక మాట -స్వామి వివేకానంద అన్నారు "అందరికీ మేలు చేయండి .అందరిని ప్రేమించండి .కాని ఎవరిపైనా వ్యామోహాన్ని పెంచుకోకండి "అని .
- బిజ్జ నాగభూషణం