కోపం
అమృత వాక్కులు
కోపం
కోపం ప్రతి మనిషికి సహజం .పుట్టుకతోనే ఇది జనిస్తుంది .పిల్ల వాడు మాటలు వచ్చిన తర్వాత నుండి ఇది ఉపయోగించడం మొదలు పెడతాడు .విశ్వామిత్రుడికి కోపం మెండు అందుకని అతడు బ్రహ్మర్షి కాలేక పోయాడు .భృగుమహర్షి కోపంతో విష్ణుమూర్తి ఎదపై తన్నితే అప్పుడు విష్ణువు అంటాడు భృగుమహర్షితో అయ్యో నీ పాదంకు ఎంత నొప్పి అయ్యిందో అని అతని పాదంలో వున్న అహంకార బుడగలను నొక్కివేస్తాడు .అప్పుడు అతని కోపం తగ్గుతుంది .కోపం ఎప్పుడు మనిషికి కీడు చేస్తుంది కాని మేలు చేయదు .అందుకని వేమన అన్నాడు "తన కోపమే తన శత్రువు "అని .అది నిజమే మనకు "జ్ఞానంతో మిత్రులు ,కోపంతో శత్రువులు పెరుగుతారు "అని నానుడి .ఎదుటివారిని కోప్పడగానే వారు నొచ్చుకొని శత్రువులుగా మారుతారు .వారు వీలుచూసి మనకు హాని కలగజేస్తారు . కోపం వచ్చిన సహనం వహిచడం మంచిది .కోపం క్షణికం అంతలోనే అవవలసిన హాని చేస్తుంది .
కోపానికి సహనం విరుగుడు .ఆసమయంలో సహనం వహిస్తే ఎదుటివారి నొకరిని నొప్పించక వారిని మన శత్రువుల లిస్టులో add అవకుండ చూసుకోవచ్చు . కోపంతో భార్యాభర్తల విడాకులు ,కుటుంబం చిన్న భిన్న మవ్వడం ,ఆర్థిక నష్టం ,సమాజంలో చడ్డపేరు ,
ఒక దేశం ఇంకో దేశంపై దండెత్తడం ఇలాంటి వన్ని అపశ్రుతులు జరుగుతాయి .
అందుకని మనము ఆ కోపం వచ్చిన క్షణం ఓపిక పట్టి సహనంవహిస్తే ,ఇది జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహకరిస్తుంది .జీవితంలో మహోన్నత వ్యక్తి కావచ్చు .అందరిలో మన్నన్నలు పొందవచ్చు మన అభివృద్ధికి అంకురం పలకవచ్చు .
ఒక మాట -ఎంత ఎత్తు ఎదిగినా మానవత్వం మరవవద్దు .మంచి చేయడం విడవవద్దు .
- బిజ్జ నాగభూషణం