Online Puja Services

మరణం

3.139.94.189
అమృత వాక్కులు
మరణం 
 
మన జీవితం ఏ క్షణం అంతమౌతుందో తెలియదు .కర్ణుడు శ్రీ  కృష్ణునితో మహాభారతం లో "క్షణం జీవితమావయో యమస్య కరుణా నాస్తి "అన్నాడు అంటే జీవితం క్షణికం ,యముడు కఠినాత్ముడు అని అన్నాడు .అయినా ఈ ప్రపంచ వ్యామోహాన్ని వదిలి పెట్టం ,దేహ బ్రాన్తి మనకు అంటుకునే వుంటుంది .ఇది మానవ సహజం ."జాతస్య హి ధృవం మృత్యుహు "అని వేదాల్లో వుంది .మనపెద్దలు 

"పుట్టుట గిట్టుట కొరకే "అన్నారు .ఒక కవి "కళ్ళు తెరిస్తే జననం ,కళ్ళు మూస్తే మరణం ,రెప్ప పాటు జీవితం "అన్నాడు .మనకు జననం అంటే సంతోషమే కాని మరణం అంటే భయపడతాము .రెండు రోజుల క్రితం ఒక హాస్పిటల్ లో ఇద్దరు కరోనా వల్ల జీవిత చివరి దశలో వున్నారు .వారు డాక్టర్ తో అన్నారు ఇంకా రెండు మూడు రోజులు బ్రతికించవా ,మాకు కుటుంబం తో గడపాలని ,ధనం సంపాదించాలని అడగడం లేదు ,చివర్లో ఎవరికన్నా మంచి చేసి పోదామని .

మరణం అనే శబ్దం ఉచ్చారణ  చేయడం కూడా మనకు ఇష్టముండదు, కాని సహజం .అయితే ఈ రోజు మనము మరణాన్ని ఎన్ని రకాలుగా ప్రపంచంలో వాడుతున్నామో చూద్దాము .      

1. మరణం -
 
a )సహజ మరణం 
b )దుర్మరణం 
c )అపమృత్యు మరణం .
                
a )సహజ మరణం -మనిషి రాత్రి పడుకుని నిద్రలోనే చనిపోవడం లేక మాట్లాడుతూ సోలిగి క్రింద పడి మరణించడం .
 
b )దుర్మరణం -train accident ,road accident లేక వరదలో కొట్టుకు పోవడం లాంటివి .
 
c )అపమృత్యువు మరణం -పెళ్లయిన తెల్లవారి జంటలో ఒకరు మరణంచడం లేక యువకుడు అనుకోకుండా మరణించడం .చిన్న పిల్లవాడు మరణించడం .అంటే ఇంకా జీవించ వలసిన వయసు వుండగానే అకస్మాతుగా చనిపోవడం .
 
2)నిర్యాణం -ఇది ముఖ్యంగా గురువులకు ,ఋషులకు ,మహాత్ములకు వారు మరణించినప్పుడు నిర్యాణం చెందారు అని అంటారు అంటే 
ఈ శరీరాన్ని వదిలి జీవి వెళ్లిపోయిందని అర్థం .                 
 
3)పరమపదం -ఇది అందరికి మరణించినప్పుడు వాడుతున్నారు .కాని ఇది నాయకులు ,మహాపురుషులు వాడవలసిన పదం .పరమపదం అంటే ఇతడు పరమాత్మలో లీనమైనాడు అని అర్థం .అంటే మోక్షం పొందాడు అని చెప్పుకోవచ్చు .   
 
4)సమాధి -
a )సామాన్య ప్రజల సమాధి 
b )మహాత్ములు అంటే దైవ స్వరూపులైన వారి సమాధి .  
                                
a )సామాన్య ప్రజల సమాధి -ప్రజల్లో ఎవరన్నా చనిపోతే వారి అంత్యక్రియలు అయిన తర్వాత ,కొంత బూడిద తీసి స్మాశాన్నాం లో ,ఊళ్ళల్లో అయితే చెరువు కట్టన ఒక చోట బూడిదపై సమాధి నిర్మిస్తారు .సంవత్సరానికి ఒక సారి సంవత్సరీకం రోజున ఆ సమాధిని శుభ్రం చేసి ఏడ పెడతారు .కొందరు ఊళ్లల్లో వారి పొల్లాల్లో సమాధి నిర్మిస్తారు .   
                   
b )మహాత్ములు అంటే దైవ స్వరూపులైన వారి సమాధి -.    
 
1)వారు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కట్టే సమాధి 
2)జీవ సమాధి .      
          
1)వారు శరీరాన్ని వదిలి పెట్టిన తర్వాత కట్టే సమాధి -షిర్డీ సాయి బాబ సమాధి ,శ్రీ రాఘవేంద్ర స్వామి సమాధి .షిర్డీ సాయిబాబ తన సమాధి నుండి మూడు వందల సంవత్సరాలు తన భక్తులకు ఓ  అంటే ఓ అని పలలికి వారి కష్టాలు తీరుస్తాడట .శ్రీ రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో తన సమాధి అయిన బృందావనం నుండి భక్తులకు ఓ అంటే ఓ అని భక్తులకు ఆరు వందల సంవత్సరాలు భక్తులకు కోరికలు తీరుస్తాడట .  
  
 2)జీవ సమాధి -శ్రీ రామానుజాచార్యులు జీవ సమాధి అయి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ శ్రీరంగ పట్టణంలో దేవాలయంలో భద్రపరిచి వుంచడం విశేషం .పద్మాసనం లో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టారు .ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది .ప్రతీ ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు .ఆ సమయంలో కర్పూరం ,కుంకుమ పువ్వును    ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు .అందు వల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలో మెరుస్తూ కనిపిస్తుంది .అయితే హారతి   ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు ,గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు . శ్రీ  రామానుజాచార్యులు 123 ఏళ్ళు జీవించి విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి కృషి చేశారు . మన శేష జీవితం హాయిగా ,సంతోషంగా గడిపి ,జ్ఞానార్జన చేసి ,ప్రజల సేవ చేస్తూ జీవితం భగవంతునికి అంకితం చేయడం శ్రేయస్కరం . ఒక మాట -అందరికి తెలిసేలా చెప్పేది సిద్ధాంతం .ఎవ్వరికీ తెలియకుండా చెప్పేదీ వేదాంతం

- బిజ్జ నాగభూషణం 

Quote of the day

The life ahead can only be glorious if you learn to live in total harmony with the Lord.…

__________Sai Baba