దానం 6 మార్గాలు
అమృత వాక్కులు
దానం 6 మార్గాలు
దానం - ఈ జగత్తును నడిపించే ప్రాథమిక సూత్రం ఇవ్వడం. దానాన్ని మించిన విద్యుక్త ధర్మం లేదని మనకు కర్తవ్యబోధ చేశాయి శాస్త్రాలు.
దానం మార్గాలు ఆరు. 1) మొదటి మార్గం - తోటి వారు అవసరంలో వున్నప్పుడు స్పందించి
వస్తురూపంలో సహాయం చేయడం దానాల్లో మొదటి మార్గం.
2) రెండో మార్గం - పది మంది ఒక చోటచేరి సమిష్టితత్వంతో చేసే శ్రమ దానం రెండో మార్గం.
3) మూడో మార్గం - తనలోని జ్ఞాననిధిని ఎదుటివారికి పంచి వారి
ద్వారా అద్భుతాలు సృష్టించగల జ్ఞాన దానం మూడో మార్గం.
4) నాలుగో మార్గం - బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, సన్నిహితులు ఆపద వేళ వారికి సమయాన్ని కేటాయించడం నాలుగో
మార్గం .
5) ఐదో మార్గం - పెద్దవాళ్లందరు వారికున్న జీవిత అనుభవాన్ని, ఒడుదొడుకులను పరిగణలోకి తీసుకొని ఎదుటివారికి పెద్దమనసుతో
ప్రోత్సహించడం ఐదో మార్గం.
6) ఆరో మార్గం - మనకు సహాయం చేసినప్పుడు ఎదుటివారికి తప్పకుండ ధన్యవాదాలు తెలుపాలి. అలాంటివారిని ప్రోత్సహించి వారు ఇంకా పది మందికి ఆదుకునేలా చేయాలి. కృతజ్ఞతగా ఉండటం జీవితానికి పరిపూర్ణతనిస్తుంది. కృతజ్ఞత కనబరచడం ఆరో మార్గం.
ఇన్ని మార్గాల ద్వార దానం చేయవచ్చు, కీర్తి ప్రతిష్టలు పెంపొందించు కోవచ్చు. ముఖ్యముగా భగవంతుని కృపకు పాత్రులు కావచ్చు. మోక్షానికి ఇదొక మార్గం అవుతుంది. మోక్షం పొందేలా చేస్తుంది.
- బిజ్జ నాగభూషణం