రెండు రకాల శరీరాలు
అమృత వాక్కులు
రెండు రకాల శరీరాలు
శరీరాలు రెండు రకాలు
1) స్తూల శరీరం,
2) సూక్ష్మ శరీరం
1) స్తూలశరీరం - మనకు భౌతికంగా కనిపించేది స్తూల శరీరం. ఇది మనిషి జీవాత్మకు నిలయం. ఈ స్తూల శరీరమే ఆధ్యాత్మిక సాధనకు, మోక్షప్రాప్తికి, సేవాతత్పరతకు అనువైన ఉపకరణం. మానవ శరీరమే ఉత్తమమైన పనిముట్టు.
2) సూక్ష్మ శరీరం - మనిషి స్తూల శరీరంలోనే సూక్ష్మ శరీరం నిఘాడంగా వుంటుంది. మనసు, చిత్తము, బుద్ధి, అహంకారం అనే అంతఃకరణ చతుష్టయం, ఇంద్రియాలతో కూడినదే సూక్ష్మశరీరం. మనసొక సత్యపదార్థం. దానికి నామరూపాలు లేవు. మనసు మంచి సలహాదారుగా తన కర్తవ్యం నేరవేరుస్తుంది.
మనసు ఇంద్రియాలతో సంయోగం చెందినప్పుడు మాత్రమే బాహ్యజగత్తులోని దృశ్యం అవగతమౌతుంది. మనసు ఆలోచనాశక్తి, చిత్తం చాంచల్య శక్తి, బుద్ది నిర్ణయాత్మక శక్తి అంటారు ప్రాజ్ఞులు. స్వచ్ఛమైన బుద్ధి మనసును ఆధీనంలో ఉంచుకొని ఉత్తమోత్తమ కార్యాలవైపు మళ్ళిస్తుంది. బుద్ది, మనసు, శరీరావయవాల సమన్వయమే దేహాన్ని మోక్షమార్గం వైపు నడిపిస్తుంది. మనిషి జీవితానికి స్తూలశరీరం, సూక్ష్మశరీరం రెండు ముఖ్యమైనవే.
- బిజ్జ నాగభూషణం