Online Puja Services

విలువైన ప్రశ్నలు

3.137.180.62
అమృత వాక్కులు 
విలువైన ప్రశ్నలు 
 
శిష్యుడు అడిగిన ప్రశ్నలు మరి వాటికి గురువుగారి జవాబులు ఈ క్రింద వున్నవి. 
 
1) శిష్యుడు - ఈ ప్రపంచంలో అన్నింటికన్నా పదునైనది (sharpest)గా ఉండేది ఏది? 
గురువు - అన్నింటికన్నా నిశితంగా వుండేది నాలుక. ఎందుకంటే ఇది మిత్రులను చేయవచ్చు శత్రువులను కూడా చేయగలదు. 
 
2) శిష్యుడు - అన్నినింటికన్నా దూరమైనది ఏది? 
గురువు - అన్నింటికన్నా దూరమైనది గతం. ఎందుకంటే గతాన్ని ఎవరు చేరలేనంత దూరం. 
 
3) శిష్యుడు - అన్నింటికన్నా పెద్దదైనది ఈ ప్రపంచంలో ఏది? 
గురువు - అన్నింటికన్నా పెద్దదైనది ఈ ప్రపంచంలో మనిషి కోరికల చిట్టా. 
 
4) శిష్యుడు - అన్నింటిక్కన్నా ధృడమైనది (గట్టిగ ఉండేది), మరియు బరువైనది ఈ ప్రపంచంలో ఏది? 
గురువు - అన్నింటికన్నా ధృడమైనది, మరియు బరువైనది, ఈ ప్రపంచంలో ఒకరికి promise చేయడం మరియు, నెరవేర్చడం, 
 
5) శుష్యుడు అన్నింటికన్నా బరువులేనిది, అంటే తేలికగా వుండేది (light గా వుండేది) ఏది? 
గురువు - అన్నింటికన్నా బరువులేనిది వినయ వినమ్రతలు. 
 
6) శిష్యుడు - అన్నింటికన్నా దగ్గరగా వున్నది ఈ ప్రపంచంలో ఏది? 
గురువు - అన్నింటికన్నా దగ్గరగా వున్నది ఈ ప్రపంచంలో మృత్యువు. అది ఎప్పుడు కబళించివేస్తుందో ఎవరికీ తెలియదు. 
 
7) శిష్యుడు - అన్నిటికన్నా ప్రపంచంలో సులువుగా చేయగలిగింది ఏది?
గురువు - ప్రపంచంలో అన్నింటికన్నా సులువుగా చేయగలిగింది ఏంటంటే ఒకరి హృదయాన్ని గాయపరచడం. ఎందుకంటే దీనికన్నా సులువుగా చేయగలిగింది ఇంకొకటి లేదు.
 
- బిజ్జ నాగభూషణం 

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda