భగవన్నామాలు
అమృత వాక్కులు
భగవన్నామాలు
a) ఏకాత్మకుడు - “ఏకం సత్ బహవో వదంతి విప్రహః” (బహ పదార్థం ఒక్కటే అయినప్పటికీ అవసరాన్ని బట్టి అనేక రూపాలుగా కనిపిస్తుంది) అని వేదాంతులు చెప్పారు. బ్రహ్మ పదార్థం ఒక్కటే కనుక ఏకాత్మకుడు.
b) ద్వైదీభావాత్మకుడు - భగవంతుడు నమ్మేవారికి వారి ఆత్మలోనే వుంటాడు. భగవంతుడు లేడనేవారికి వారి మనోభావాలకు విఘాతం కలగకుండా దూరంగా వుంటూ వారిని కాపాడేవాడు. ఉన్నాడను కునేవారికి ఉన్నాడు, లేడనుకునేవారికి దూరంగా వున్నాడు. రెండు భావాలూ కలవాడు కాబట్టి ద్వైదీభావాత్మకుడు.
c) త్రిగుణాత్మకుడు - సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలున్న వారిని, వారికి తగినట్లు అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని చూపేవాడు. మూడు గుణాలు తానై వున్నవాడు కనుక త్రిగుణాత్మకుడు.
d) చతురుడు, నాలుగు దిక్కులా నిండి వున్నవాడు, నాలుగు వేదాలు ప్రస్తుతించేవాడు. సమయాన్ని, భక్తుల మనోభావాల్ని బట్టి ప్రవర్తించేవాడు. నాలుగు దిక్కులు, నాలుగు వేదాలలో వున్నవాడు కనుక చతురుడు.
e) పంచభూతాత్మకుడు : భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలలో ఆత్మస్వరూపంగా ఉంటూ వాటిని నియంత్రిచేవాడు కనుక పంచభూతాత్మకుడు.
ఈ అయిదు భగవన్నామాలు.
- బిజ్జ నాగభూషణం