భాషణం
అమృత వాక్కులు
భాషణం
భాషణం అంటే మాట్లాడటం, ఆరు విధాలు
1. హిత భాషణం
2. మిత భాషణం
3. ప్రియ భాషణం
4. స్మిత భాషణం
5. పూర్వ భాషణం
6. సత్య భాషణం.
వీటిలో శ్రీరామచంద్రుడు ఉపయోగించినవి స్మిత భాషణం, పూర్వ భాషణం.
స్మిత అంటే చిరునవ్వుతో, పూర్వ అంటే ఎదుటివారిని వారికన్నా ముందే వారిని పలకరించడం, వారి యోగక్షేమాల్ని అడిగి తెలుసుకోవడం. అంటే శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో ఎదుటివారిని వారి కన్నా ముందే వారిని పలుకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవాడంట. ఇలా ప్రజలందరితో మాట్లాడేవాడట. తన రాజ్యంలో చిన్న పిల్లవాళ్లను సహితం ఇలానే మాట్లాడేవాడట. అందుకే శ్రీరామచంద్రుడు షోడశ గుణ పూర్ణుడయ్యాడు. అంటే పదహారు గుణాలు పూర్ణంగా కలవాడయ్యాడు.
ఈ ఆరు భాషణలలో మొదటిది హిత భాషణం, అంటే ఎదుటివారికి మంచి కలిగించే భాషణమన్నమాట.
రెండవది మిత భాషణం, అంటే అవసరమున్నంత వరకే భాషణమన్నమాట.
మూడవది ప్రియ భాషణం, అంటే ప్రియమైనమాటలే మాట్లాడటమన్నమాట.
నాల్గవది స్మిత భాషణం, అంటే ఎప్పుడూ చిరుమందహాసంతో భాషించడమన్నమాట.
అయిదవది పూర్వ భాషణం, అంటే ఎదుటివారిని వారికంటే ముందే
వారితో భాషించి వారి యోగక్షేమలాడగటమన్నమాట.
ఆరవది సత్యభాషణం, అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడడమన్నమాట. సత్యహరి చంద్రుడిలాగ వాగ్భాషణమే మనిషికి భూషణమన్నమాట. అంటే మనిషి మాట్లాడే వాక్కులే మనిషికి భూషణమన్నమాట.
- బిజ్జ నాగభూషణం