Online Puja Services

దేహమే దేవాలయం

18.222.44.156
దేహమే దేవాలయం -జీవుడే సనాతన దైవం
దయచేసి 10 నిమిషాలు సమయం తీసుకొని చదవండి..........
 
మానవుడు తల్లి కడుపునుండి మరణం దాకా ప్రయాణ విశేషాలు.......
 
 
రెండు కళ్లు, రెండు కాళ్లు, రెండు చెవులు, రెండు చేతులు,ఓ మెదడు,ఓ గుండె దేహానికి బ్రీఫ్ డెఫినేషన్. కోట్లాది జీవకణాలతో అమ్మ కడుపులో ప్రాణం పోసుకుని బాల్యం, యవ్వనం, ముసలితనం అనే మూడు దశల్ని దాటి మనిషి మరణాన్ని ముద్దాడుతున్నాడు. క్షణం గడిస్తే చాలు పోల్చుకోలేనంతగా మారుతున్న ప్రపంచానికి సాక్ష్యంగా మారుతున్నాడు. అయితే తన దేహంలో జరిగే మార్పులతో పాటు అసలు తన శరీరం ఎలా ఏర్పడిందో మాత్రం తెలియకుండానే బతికేస్తున్నాడు.
 
ఎలా జరిగిందో తెలియదు. ఎందుకు జరిగిందో కూడా తెలిసే అవకాశం లేదు. కాని అనంత విశ్వంలో భూమిపై మాత్రమే కోట్లాది సంవత్సరాల క్రితం అద్భుతం జరిగింది. ఏక కణ జీవానికి ఎవరో మంత్రసాని ప్రాణం పోసింది. అలా లక్షల జీవజాతులకు పురుడు పోసిన ప్రకృతి మాత, ఎందుకో మనిషిపైనే మమకారం పెంచుకుంది. అందుకే ఏ జీవికి లేని ఆలోచన శక్తిని ఇచ్చింది. అద్భుతమైన శరీరాన్ని ఇచ్చింది. ఎప్పటికప్పుడు దానికి ఎన్నో ప్రత్యేకతలను యాడ్ చేసింది. ఎట్ లాస్ట్ ఈ సృష్టిలో మనిషి శరీరాన్ని ఓ మిరాకిల్ గా మార్చింది.
 
ఇంతకీ మనం ఎలా పుడుతాం? ఎలా చనిపోతాం? ఈ మధ్యలో శరీరంలో ఏం జరుగుతుంది?
 
అండం, పిండం, అడ్రినల్
 
శుక్రకణాలు అండంతో కలిసిన కొన్ని రోజులకు గర్భంలో పిండం ప్రాణం పోసుకుంటుంది. ప్రశాంతమైన వెచ్చటి వాతావరణంలో క్రమ క్రమంగా పూర్తి స్థాయి శిశువుగా మారుతుంది. 40 వారాల తర్వాత తల్లికి పురుటి నొప్పుల బాధన పంచి, పురుడు పోసుకుంటుంది.
 
ఈ లోకంలోకి వస్తూ వస్తూ తనతో పాటు ప్రమాదాన్ని వెంట తెచ్చుకుంటుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువుకు ఏం కావాలో అన్నింటిని అమ్మ కడుపే చూసుకునేది. కాని బొడ్డు పేగు బంధం తెగినంక అన్ని పనులను శిశువు సొంతంగా చేసుకోవాల్సిందే. శ్వాస కూడా సొంతంగానే తీసుకోవాలి. అయితే ఊపిరితిత్తుల్లో ఫుల్లుగా అమ్నియాటిక్ ఫ్లూయడ్స్ ఉండడంతో పాపాయికి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కొద్దిసేపు అలానే ఉంటే చనిపోయే అవకాశం కూడా ఉంది. పుట్టిన పాపాయి మెడపై వేలాడే ఆ చావును శరీరమే తప్పిస్తుంది. మూత్రపిండాల మీదుండే అడ్రినల్ గ్లాండ్స్…రక్తనాళాల్లోకి అడ్రినల్ యాసిడ్ ను పంప్ చేస్తాయి. కండరాలకు ఒక్కసారిగా చైతన్యం వస్తుంది. టోటల్ గా బాడీకి కరెంట్ షాక్ తాకి ఊపిరితిత్తుల్లో చలనం వస్తుంది. అమ్నియాటిక్ ఫ్లూయడ్స్ బయటకు పంపేసి ఊపిరితిత్తులు తొలిశ్వాస తీసుకుంటాయి.
 
ఒక సిస్టమ్ ప్రకారం శరీరంలోకి శ్వాస చేరుతుంది. ఊపిరితిత్తుల్లో వేలాదిగా ఉండే ట్యూబుల్లో ప్రయాణించే గాలి లక్షలాది చిన్నచిన్న గాలిసంచుల్లోకి చేరుతుంది. అవి ఆక్సిజన్ ను మాత్రమే తీసుకొని కార్బన్ డయాక్సైడ్ ను బయటికి పంప్ చేస్తాయి. తొలి శ్వాస తర్వాత శరీరంలోని అన్ని అవయవాలు తమతమ పనుల్లో బిజీ అవుతాయి. అన్నింటికంటే ఎక్కువ పనులను కాలేయం చేస్తుంది. సుమారు 500 రకాల పనులను కాలేయం ఒక్కటే సింగిల్ గా సెటిల్ చేస్తుంది. బాడీ టెంపరేచర్ ను కంట్రోల్ చేయడం, టాక్సిన్ లను ప్రాసెస్ చేయడంతో పాటు మరెన్నో పనులను లివర్ చక్కబెడుతుంది.
 
పుట్టిన వెంటనే బాడీ లోని అన్ని అవయవాలు పర్ ఫెక్ట్ గానే ఉంటాయి. జీర్ణ వ్యవస్థ కూడా ఆహారం కోసం రెడీ గా ఉంటుంది. కాని పేగులు మాత్రం సిద్దంగా ఉండవు. అమ్మ కడుపులో ఉన్నప్పుడు వచ్చిన ఆమ్నియాటిక్ యాసిడ్స్ తో పాటు మృతకణాలు పేగుల్లో పేరుకుని ఉంటాయి. నలుపు, ఆకుపచ్చ రంగులో జిగురుగా ఉండే ఆ మిశ్రమాన్ని మెకోనియం అంటారు. దీంతో డేంజర్ ఏం లేదు. కాకపోతే తిన్నది ఏదైనా జీర్ణ వ్యవస్థకు చేరాలంటే పేగుల్లో ఉన్న మెకోనియం అంతా బయటకు పోవాలి. అయితే అమ్మపాలు తాగిన కొద్దిసేపటికే మలం రూపంలో మెకోనియం బయటకు వెళ్లిపోతుంది.
 
చంపేసే చలి- బతికించే చనుబాలు 
 
అమ్మ కడుపులో..38 డిగ్రీల టెంపరేచర్ లో శిశువు వెచ్చగా ఉంటుంది. అయితే డెలివరీ అయ్యాక 18 డిగ్రీల రూం టెంపరేచర్ లోకి వచ్చి డేంజర్ లో పడుతుంది. ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా కలిగిన ఈ మార్పును పసిప్రాణం తట్టుకోలేదు. అందుకే వెచ్చగా ఉండడం కోసం లోపలున్న ఉష్ణాన్ని శరీరం బయటకు పంపుతుంది. దీంతో బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పడిపోతుంది. దీన్ని హైపోథర్మియా అంటారు. బాడీ టెంపరేచర్ ను కంట్రోల్ చేసే హైపోథాలమస్ గ్రంథి పూర్తి స్థాయిలో డెవలప్ కాకపోవడమే ఇందుకు కారణం. అయితే ఈ లోటును వెంటనే గుర్తించే శరీరం, అప్పటికప్పుడు కొన్ని ప్రత్యేక కణాలతో కొవ్వును తయారుచేస్తుంది. దాంతో అదనంగా ఉష్ణం ఉత్పత్తి అయి బాడీ వెచ్చగా అవుతుంది. మెదడులోని హైపోథాలమస్ గ్రంథి వర్కింగ్ కండీషన్ లోకి వచ్చేదాక ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది.
 
పుట్టిన వెంటనే తల్లిపాలు తాగాలని ఎవరూ చెప్పరు. చెప్పినా విని అర్థం చేసుకునే కండీషన్ లో పాపాయి ఉండదు. కాని అసంకల్పితంగానే శిశువు అమ్మపాలు తాగుతుంది. బతకాలన్న ఆశే పసిగుడ్డుతో ఆ పని చేయిస్తుంది. గర్భం నుంచి బయటకు వచ్చాక బ్యాక్టీరియా దాడి చేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ ఇంకా రెడీగా లేకపోవడంతో బ్యాక్టీరియాను ఎదుర్కునే శక్తి చిట్టి శరీరానికి ఉండదు. అలా అని చూస్తూ ఊరుకుంటే ఆ క్రిములు ఖతం చేస్తాయి.
 
అందుకే ఏదో ఒకటి చేయమని మెదడును చిన్నారి శరీరం ప్రాధేయపడుతుంది. ఓ వైపు ఈ విన్నపాల తంతు నడుస్తుండగానే మరోవైపు మురిపంగా చూస్తూ మాతృమూర్తి పొత్తిళ్లలోకి తీసుకుంటుంది. ఆమె చేతి స్పర్శ తాకంగనే శరీరం అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతుంది.
 
ఆప్యాయంగా చూస్తున్న అమ్మ చిన్నారి కంటికి దేవతలా కనిపిస్తుంది. ఆ దైవాన్ని తన్మయత్వంతో చూస్తూనే అప్రయత్నంగానే అమ్మ చనుబాలను చప్పరిస్తుంది. రక్తాన్నే పంచి బిడ్డకో రూపాన్నిచ్చే పిచ్చితల్లి, రోగనిరోధక వ్యవస్థను ఇవ్వదా? తన శరీరంలోని యాంటీ బయాటిక్స్ ను పాలలో కలిపి బిడ్డకు అందిస్తుంది అమ్మ. శిశువు శరీరంలోని బ్యాక్టీరియాతో ఆ యాంటీ బయాటిక్స్ పోరాడుతాయి. సొంతంగా రోగనిరోధక వ్యవస్థ డెవలప్ అయ్యేదాక తల్లిపాలే శిశువును కాపాడుతాయి.
 
అంతా బ్లాక్ అండ్ వైట్ 
 
 
బిడ్డ పుట్టిందని ఉయ్యాలలో వేసి గ్రాండ్ ఫంక్షన్ చేస్తారు అమ్మానాన్న.. ఈ తతంగం అంతా బిడ్డకు కొత్తగా అనిపిస్తుంది. అయితే తాను వచ్చినందుకే ఈ సంతోషమన్న క్లారిటీ మాత్రం ఉంటుంది. పుట్టిన ఆరేడు వారాల దాక పరిసరాలను అర్థం చేసుకునే అతీత శక్తి ఉండడమే ఇందుకు కారణం. దీంతో పాటు అద్భుతమైన వినికిడి శక్తి కూడా ఉంటుంది. చిన్న చిన్న సౌండ్స్ కూడా డీటీఎస్ లో వినబడతాయి. అయితే పెరుగుతున్న కొద్ది ఈ పవర్ తగ్గిపోతుంది. ఇక కొన్ని నెలల వరకు బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికి మెదడు ఇంకా నిర్మాణ దశలోనే ఉంటుంది. అందుకే కళ్లు పంపే చిత్రాలను మెదడు సరిగా అర్థం చేసుకోలేదు. కాని ఏజ్ పెరుగుతున్న కొద్దీ మెదడుతో పాటు కళ్లు కూడా డెవలప్ అవుతాయి.సేమ్ టైమ్ పిక్ఛర్ క్వాలిటీ కూడా పెరుగుతుంది.
 
పుట్టిన తర్వాత ప్రతీనెల మొత్తం బరువులో పావు వంతు శరీరం పెరుగుతూ పోతుంది. పుట్టినంక మూడు నెలలు మాత్రమే ఈ ప్రాసెస్ యాక్టీవ్ గా ఉంటుంది. ఆ తర్వాత ఈ పెరుగుదల రేటు తగ్గుతుంది. లేకుంటే నాలుగేళ్లకే తిమింగలం అంత బరువు పెరుగే అవకాశం ఉంది. ఎనిమిది నెలలొచ్చేసరికి స్పర్శతో కొత్త విషయాలు తెలుస్తాయి. దేన్నైనా తాకిన వెంటనే చేతివేళ్లకు ఉండే గ్రాహకాలు చర్మంలోని నరాల ద్వారా, వయా వెన్నుపూస నాడులు ఎలక్ట్రికల్ తరంగాల రూపంలో మెదడుకు మెసేజ్ పంపిస్తాయి. గంటకు 320 కిలోమీటర్ల స్పీడుతో ఈ టపా మైండ్ కు డెలివరీ అవుతుంది. మేయిల్ రాంగనే మెదడు దాన్ని అర్థం చేసుకుని అందుకు తగ్గ రియాక్షన్ ను సేమ్ స్పీడులో పంపిస్తుంది.
 
పుట్టిన తరువాత జరిగే కీలక పరిణామాల్లో పళ్లు రావడం ముఖ్యమైంది. గర్భంలో ఉన్నప్పుడు చిగుళ్లలోనే పాలదంతాలు ఉంటాయి. తరువాత మెల్లగా బయటకొస్తాయి. అప్పటి నుంచి ఘన పదార్థాలను తినడం మొదలవుతుంది. నోట్లో ఊరే లాలాజలంతో తినే ఆహారం సాఫీగా పేగుల్లోకి వెళుతుంది. ఆ తర్వాత కొన్ని రకాల యాసిడ్స్ ఉత్పత్తి అయి ఆహారం జీర్ణం అవుతుంది. పనికిరానిది ఏదైనా ఉంటే అది బయటకు వెళ్లిపోతుంది.
 
సొంత వైద్యం-ధృఢమైన ఎముకలు
 
 
ఫస్ట్ బర్త్ డే తో శరీరంలో కీలక మార్పులు మొదలవుతాయి. నడవాలన్న ఆలోచన రావడానికి ముందే ఎముకలు గట్టిపడతాయి. పుర్రెలోని ఎముకల మధ్య ఉన్న ఖాళీ మూసుకుపోతుంది. ప్రపంచంతో ఇంటరాక్ట్ అయ్యేందుకు శిశువు తెగ ప్రయత్నిస్తుంది. సొంత కాళ్ల మీద నిలబడడానికి నాన్న బ్యాంక్ బాలెన్స్ కాదు చెవులే హెల్ప్ చేస్తాయి. చెవిలోపల ఉండే ఆర్సికల్స్ వెనక ముడుచుకుని ఉండే మూడు నిర్మాణాలు ఇందుకు సహాయం చేస్తాయి.లిక్విడ్ తో నిండి ఉండే ఆ నిర్మాణాల్లోని వెంట్రుకలు పంపే డాటా ఆధారంగానే పిల్లలు నిలబడతారు. ఇంతేకాదు ఎటు దిక్కు పోవాలి? శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్న సమాచారం కూడా చెవే చెపుతుంది.
 
నడవడం నేర్చుకున్నాక చేసే ముఖ్యమైన పని మాట్లాడడం. చాలా మంది ఫస్ట్ బర్త్ డే నాటికే ముద్దుముద్దుగా మాట్లాడేస్తుంటారు. రెండేళ్లొచ్చేసరికి రోజుకు పది కొత్త పదాలను నేర్చుకుంటారు. మెదడులోని బ్రోకస్ ఏరియా ఈ విషయంలో హెల్ప్ చేస్తుంది. ఐదు సంవత్సరాలకు మెదడు బాగా డెవలప్ అవడంతో సొంతంగా కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు ఏర్పడుతాయి
 
చిన్న చిన్న గాయాలు, వ్యాధులకు సొంతంగా చికిత్స చేసుకునే నైపుణ్యం శరీరానికి ఉంటుంది. బడికి వెళ్లే టైంలో పిల్లలను క్రిములు టార్గెట్ చేస్తాయి. అయితే కళ్లు, ముక్కు, చెవులు, చర్మంపై ఉండే వెంట్రుకలు ఆ క్రిములను పట్టుకుని చెమట, కన్నీళ్ల రూపంలో బయటకు పంపేస్తాయి. నోట్లో ఉండే లెక్కలేనన్ని సూక్ష్మక్రిములతో చాలా డేంజర్. అయితే రోజూ ఒకటిన్నర లీటర్లు ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఉండే ప్రత్యేక రసాయనాలు ఆ బ్యాక్టీరియాను చంపేస్తాయి. మృత కణాలతో పాటు ఆ బ్యాక్టీరియాను శరీరం బయటకు డంప్ చేస్తుంది. 
 
చికెన్ పాక్స్ వైరస్ మాత్రం ఈ సెక్యూరిటీనంతా దాటుకుని శరీరంలోపలికి ఎంటర్ అవుతుంది. ఒక కణాన్ని హైజాక్ చేసి తన అడ్డాగా మార్చుకుంటుంది. అందులోనే తన లాంటి వైరస్ లను విచ్చలవిడిగా ఉత్పత్తి చేస్తుంది. అవన్నీ మిగతా కణాలను ఆక్రమించుకుంటాయి. శరీరం అంతా చికెన్ పాక్స్ వైరస్ వ్యాపిస్తుంది. ఈ అటాక్ గురించి అప్పటికే ఇన్ ఫర్ మేషన్ అందుకునే రోగనిరోధక వ్యవస్థ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుంది. ముందుగా వైరస్ ను చికాకు పరిచేందుకు బాడీ టెంపరేచర్ ను విపరీతంగా పెంచుతుంది. దీంతో జ్వరం వస్తుంది. ఆ తర్వాత తెల్లరక్తకణాలు రంగంలోకి దిగి వైరస్ ఆక్రమించిన కణాల్లోకి ప్రమాదకరమైన ప్రోటీన్లను ఇంజెక్ట్ చేస్తాయి. ఫలితంగా ఆ కణంతో పాటు వైరస్ కూడా చచ్చిపోతుంది. చనిపోయిన కణాలతో పాటు వైరస్ ను చిన్న స్పోటకాల రూపంలో బాడీ బయటకు పంపేస్తుంది. అందుకే చికెన్ పాక్స్ వచ్చాక శరీరంపై నల్లటి మచ్చలు ఏర్పడుతాయి.
 
యవ్వనరాగం 
 
 
ఆడ,మగ ఎవరికైనా యవ్వనం ఎప్పుడు రావాలన్నది మెదడే డిసైడ్ చేస్తుంది. బ్రెయిన్ లోని హైపొథాలమస్ కిస్ పెక్టిన్ అనే యాసిడ్ ను విడుదల చేస్తుంది. ఆ క్షణం నుంచి రక్తంలోఈస్ట్రోజెన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. శరీరంతో పాటు మనసుకు యవ్వనం వస్తుంది. ప్రతీ రోజూ మనిషి ముఖం మారుతుంది. అమ్మాయిల్లో నెలనెలా అండం విడుదలవుతుంది. మగవాళ్లలో స్పెర్మ్ ఉత్తత్తి అవుతుంది. స్వర పేటిక తెరుచుకుంటుంది. గొంతు గంభీరమవుతుంది. మగవాళ్లలో ఉత్పత్తి అయ్యే టెస్టోస్టీరాన్ హార్మోన్ శరీరంపై వెంట్రుకల్లో పెరుగుదలకు కారణమవుతుంది. దీంతో పాటు కండరాలను పెద్దగా చేస్తుంది. టీనేజ్ లోకి రాగానే మెదడులోని కణాల రీవైరింగ్ మొదలువుతుంది. మన ఆలోచనలు,క్యారెక్టర్ లో తేడా వస్తుంది. అపోజిట్ సెక్స్ కు అట్రాక్ట్ అవడం మొదలువుతుంది. శరీరం తోడు కోరుకుంటుంది. చిలిపి ఆలోచనలతో పాటు వయసు తెచ్చే విజయాలతో యవ్వనం మరిచిపోలేని అనుభవంగా మిగిలిపోతుంది.
రెండు దశాబ్దాల్లో శరీరం ఎన్నో అద్భుతాలకు కారణమవుతుంది.
 
పుట్టినప్పటికంటే నాలుగురెట్ల ఎత్తు,21 రెట్లు బరువు పెరుగుతుంది. అప్పటికి 9 టన్నుల ఆహారం మన కడుపులో చేరుతుంది. ఈ 20 ఏళ్ల కాలంలో గుండె పదికోట్ల సార్లు కొట్టుకుంటుంది. 20 కోట్ల శ్వాసలను ఊపిరితిత్తులు ప్రాసెస్ చేస్తాయి. ఇవన్నీ జరిగాక మనిషి శరీరానికి యుక్తవయసు వస్తుంది.20 ఏళ్ల వయసు వచ్చేసరికి శరీరం చాలా మారుతుంది.పెరగడం ఒక్కటే ఆగిపోతుంది. కానీ బాడీలో మాత్రం మార్పులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. పాత కణాలు చనిపోయి కొత్త కణాలు పుడుతూనే ఉంటాయి. ప్రతీ రెండు సంవత్సరాలకు శరీరం కొత్తగా కనిపిస్తుంది. చనిపోయిన కణాలు వెంట్రుకలుగా మరో రూపంలోకి మారుతాయి. .
 
యవ్వనంలో చాలామంది దారి తప్పుతారు.
 
 
స్మోకింగ్,డ్రింకింగ్ లాంటి చెడు అలవాట్లను సొంతం చేసుకుంటారు. అయితే వీటితో శరీరానికి చాలా నష్టం. ఉదాహరణకు ఆల్కహాల్ తీసుకుంటే బాడీ,మైండ్ కంట్రోల్ తప్పుతాయి. రక్తంలో ఆల్కహాల్ కలిసిన వెంటనే హార్ట్ బీట్, బ్లడ్ ప్రెషర్ పెరుగుతాయి. మెదడులోని సెరబాలెన్స్ లో తెలియకుండానే రసాయనిక చర్యలు ప్రారంభమవుతాయి. ఆలోచనలు అదుపు తప్పుతాయి.శరీరంపై నియంత్రణ ఉండదు. ఆల్కహాల్ చేతిలో మెదడు మోసపోతుంది. శరీరం నీటిని ఎక్కువగా తీసుకుందనుకుని కిడ్నీలకు వార్నింగ్ మెసేజ్ ను మైండ్ పంపిస్తుంది. దీంతో బాడీలోని నీటిని కిడ్నీలు బయటకు పంప్ చేస్తాయి. ఆల్కహాల్ తాగితే ఎక్కువగా యూరిన్ వచ్చేది ఇందుకే. సేమ్ టైమ్ కాలేయం లో క్లీనింగ్ ప్రాసెస్ ను మొదలవుతుంది. ఆల్కహాల్ కెమికల్ గా మారుతుంది. ఈ పని చెయ్యడానికి లివర్ కు బాగా నీళ్లు కావాలి. కానీ అప్పటికే బాడీలోని వాటర్ అంతా యూరిన్ రూపంలో బయటకు వెళ్లిపోయి ఉంటుంది. దీంతో 70 శాతం నీరు ఉండే మెదడు నుంచి కావాల్సినంత నీటిని లీవర్ తీసుకుంటుంది. మైండ్ లో నీటి పరిణామం తగ్గడంతో తలనొప్పి స్టార్ట్ అవుతుంది. -ఇదే హ్యాంగోవర్
 
షాదీ- సైడ్ ఎఫెక్ట్స్ --------
 
 
పెళ్లితో శరీరం కొత్త అనుభవానికి లోనవుతుంది. సెక్స్ తో భార్యభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది. శృంగార సమయంలో స్త్రీ,పురుషుల పిట్యుటరీ గ్రంథులు ఆక్సిటోసిన్ హర్మోన్ ను రిలీజ్ చేస్తాయి. తల్లిబిడ్డల మధ్య అనుబంధానికి కారణమయ్యే ఈ హార్మోనే భార్యభర్తల మధ్య మంచి రిలేషన్ ను ఏర్పరుస్తుంది. స్త్రీ అండాశయం నుంచి విడుదలయ్యే అండంతో కలిసిన స్పెర్మ్ కొత్త జీవానికి ప్రాణం పోస్తుంది. నలభై ఏళ్లకు చర్మం ముడతలు పడుతుంది. ఆల్ట్రావయెలెట్ కిరణాలతో కాలజిన్ కణాలు తగ్గిపోయి చర్మం తన రూపాన్నికోల్పోతుంది. యాభై ఏళ్లొచ్చేసరికి జీర్ణక్రియలో వేగం తగ్గుతుంది. ఆ వయసులో ఏదైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ చేస్తుంటే శరీరం తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. రక్తకణాలు నాశనం అవుతాయి.గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. హై బ్లడ్ ప్రెషర్ తో మెదడులోని రక్తకణాలు దెబ్బతింటాయి. హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. మహిళలకు యాభై ఏళ్ల వయసులో మెనోపాజ్ వస్తుంది. అండం విడుదల కాదు. ఈస్ట్రోజెన్,ప్రొజెస్టజెన్ హార్మోన్లు రిలీజ్ కావు. పునరుత్పత్పి సామర్థ్యం పోతుంది.
 
ఇది మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.సరిగా నిద్ర పట్టదు.చీటికిమాటికి కోపం వస్తుంది. టెంపరేచర్ పై బాడీ కంట్రోల్ కోల్పోతుంది. ఎముకలు,కండరాలకు నష్టం కలుగుతుంది.ఇక్కడి నుంచి శరీరంలో మార్పులు వేగంగా జరుగుతాయి.ముసలితనం మనిషిని కమ్మేస్తుంది.
 
డెబ్బై ఏళ్లకు చెవిలో ఉండే కాక్లియర్ లో శబ్దాలను గ్రహించే వెంట్రుకలు నాశనం అవుతాయి. ఏయిర్ డ్రమ్స్ మెల్లగా మూసుకుపోతాయి. సరిగా వినబడదు.కళ్లు కూడా సరిగా కనబడవు.కనబడ్డా రంగుల్ని గుర్తుపట్టలేరు.ఆల్ట్రావయలెట్ కిరణాల ప్రభావంతో ఇలా జరుగుతుంది. ఎముకలు బలాన్ని కోల్పోతాయి. మెనోపాజ్ తో ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖంలోని ఎముకలు ప్రతి రెండు సంవత్సరాలకోసారి మారుతాయి. పాతవాటి స్థానంలో కొత్తవి వస్తాయి. పుట్టినప్పటి ముఖానికి 70 ఏళ్ల వయసులో ఉండే ముఖానికి మధ్య 35 రకాల మార్పులు జరుగుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఒక జిరాక్స్ పేపర్ ను మళ్లీ మళ్లీ జిరాక్స్ తీస్తే దాని క్వాలిటీ ఎలా పడిపోతుందో ముఖం కూడా అంతే.
 
ఇదంతా మనకు తెలియకుండానే జరుగుతుంది.
 
ది ఎండ్ -చివరి క్షణాలు
 
శరీరంలోని ప్రతీ కణంలో ఒక పవర్ స్టేషన్ ఉంటుంది. శరీరానికి కావాల్సిన శక్తి అక్కడే ఉత్పత్తి అవుతుంది. అయితే మన దగ్గరుండే పవర్ ప్లాంట్లతో ఎట్లయితే పొల్యూషన్ వస్తుందో కణంలోని పవర్ స్టేషన్ కూడా కాలుష్యాన్ని వదులుతుంది. ఈ పొల్యూషన్ ఆక్సిజన్ రూపంలో ఉంటుంది. ఆక్సిజన్ అణువులు ఫ్రీ రాడికల్స్ గా మారి కణంలో అటూ ఇటూ తిరుగుతుంటాయి. జీవితకాలం మొత్తం అవి అలా తిరగడంతో కణాలు తీవ్రంగా దెబ్బతింటాయి.వాటి పనితీరు తగ్గుతుంది.
 
ఈ పరిణామం చావుకు దగ్గరి చేస్తుంది. ఇక ఒక కణం నుంచి ఇంకో కణం.ఇలా మనిషి పుట్టినప్పటి నుంచి కణాలు కోట్లాది కణాలను తయారవుతూనే ఉంటాయి. వాటిలోని డిఎన్ఏ కొత్త కణంలోకి కాపీ అవుతూనే ఉంటుంది. కానీ ప్రతీసారి కాస్త డిఎన్ఏ పాత కణంలోనే ఉండిపోతుంది. కోట్లాదిసార్లు కణాలు కాపీ అయ్యాక చాలా డిఎన్ఏ ను లాస్ అవుతుంది. దీంతో కణాలు కొత్తగా పుట్టవు. అలా జరిగిన పది సెకన్లకే మెదడు పనిచేయడం ఆగిపోతుంది. నాలుగు నిమిషాల తర్వాత నాశనం అవడం స్టార్ట్ అవుతుంది. శరీరం స్పందనలను కోల్పోతుంది. అన్నింటికంటే చివరిగా వినికిడి శక్తి పోతుంది.
 
మరునిమిషానికే శరీరం చనిపోతుంది. 24 గంటల తరువాత చర్మకణాలు డివైడ్ అవడం బంద్ అవుతుంది.37 గంటల తరువాత మెదడు చివరి స్పందనను రికార్డ్ చేసి నాశనం అవుతుంది.
 
ఇదే మరణం.............
 
స్వస్తి.......
 
సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః
 
- ప్రసాద్ సింగ్ 
 
 

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda