మనిషి చుట్టూ ఉండే ఔరా పరివర్తనం
అమృత వాక్కులు
మనిషి చుట్టూ ఉండే ఔరా పరివర్తనం .
ప్రపంచంలో భగవంతుడు తాను సృష్టించిన మానవాళికి పూర్వజన్మ సుకృతాలను , దుష్కృతాలను తూలన చేసి ప్రతీ మానవాళికి ఔరా ఇస్తాడు.
ఔరా అంటే మనిషి చుట్టూ ఉండే అతని పవర్ అంటే అతని ఆకర్షణ శక్తి మరియు అతని స్వయం ప్రకాశన శక్తి .ఇది తలనుండి పాదాలవరకు మనిషి చుట్టూ circles గ వుంటుంది .ఈ ఔరా మనిషి వెంబడే చుట్టూ వుంటుంది .ఔరా వెడల్పు వేరు వేరుగా వుంటుంది .కొందరికి 5ఫీట్లు వెడల్పు వుండవచ్చు మరి కొందరికి 10ఫీట్లు వెడల్పు ఉండవచ్చు .ఔరా మనిషి చుట్టూ వెడల్పు ఆ మనిషి యొక్క పూర్వ జన్మ సుకృతాలను దుష్కృతాలను బట్టి భగవంతుడు నిర్ణయించిందన్నమాట .తన చుట్టూ ఉన్న ఔరా వెడల్పు అంటే తన స్వయం ప్రకాశన శక్తి వెడల్పును విస్తరించుకునే శక్తిని ప్రతీ మనిషికి ఇచ్చాడు భగవంతుడు .
ఔరా వెడల్పును పెంచుకోవడానికి ఎన్నో మార్గాలు భగవంతుడు
కల్పించాడు .మొదటిది తాను స్వయంగా తనలోని నిద్రాణమై వున్న ఆత్మశక్తిని జాగృత పరిచి దాన్ని వెలికి తీసి స్వయంగా జ్ఞానోదయ పరిధిని పెంచుకొని ఔరా వెడల్పును పెంచుకోవడమన్నమాట .భక్త రామదాసు ,భక్త తుకారాం ల లాగ ఎందరో ఈ విధానాన్ని అవలంభించి అంతర్ జ్ఞానం వృద్ధిచేసుకున్నారు .మాహాత్మాగాంధీ ,బాబాసాహెబ్ అంబెడ్కర్ ,బాలగంగాధర్ తిలక్ ,సుభాష్ చంద్ర బోస్ ,రమణ మహర్షి ఈ కోవలోకి చెందినవారే .
ఔరా వెడల్పును పెంచుకునే రెండవ మార్గం -గురువులను ఆశ్రయించి వారి ద్వార ఙ్ఞాసనోదయం పొంది ఆత్మ శక్తిని సంపాదించి ,తనలో చైతన్య పరిధిని పెంచుకొని ఔరా వెడల్పును పెంచుకోవడం .ఈ కోవకు చెందిన వారుఆదిశంకరాచార్యులు ,స్వామి వివేకానంద వారికి బోధించిన గురువులు గోవింద భగవత్ పాదులు ,స్వామి రామకృష్ణ పరమహంస .గురువులు వారి ఔరా వెడల్పును అపరిమితంగా పెంచుకొని మహాత్ములై భగవంతుని కరుణాకటాక్షాలను పొంది భగవంతుని సాన్నిధ్యము పొందిన వారు .మనము అట్టి వారిని ఆదర్శముగా తీసుకొని ఉత్తేజము పొంది మనలోని ఆత్మ జ్ఞానాన్ని వెలికి తీసి ఔరా వెడల్పును పెంచుకొని ఆత్మ ప్రకాశాన్ని పొంది అందరిలో వెలుగొందాలి
బిజ్జ నాగభూషణం