దేహాంతము వేళ
అమృత వాక్కులు
దేహాంతము వేళ
దేహమొదిలి వెళ్ళే దయనీయ స్థితియందు ,
గతము గుర్తుకొచ్చి మనసు కలత చెందె ,
దోచిన సొమ్మంత దాచి పెట్టితినని ,
ఆలుబిడ్డల దూషించి ఏడిపించితినని ,
ఎవరెవరిని పరుష పదాలతో వారి మనసు గాయపరచినవి ,
అన్న మడుగ ఇంటికొచ్చిన బిచ్చగాడిని ఛీదరించి పంపినది ,
పరోపకారము ఒక్కరికీ చేయక బ్రతికితి ననుచు ,
ఆకర్షణలనే మాయ మనసును కప్పీ కర్తవ్యాన్ని మరిచినవన్నీ ,అశాశ్వతమైన
దేహాన్ని చూసి మురిసి సుఖముల బడితిననియు ,
కన్ను మిన్ను కానకుండ కళ్ళకు పొరలు కప్పి ప్రవర్తిస్థిననియు , అయినా ఇప్పుడు ప్రాయశ్చిత్తానికి సమయమేది , యమకింకరుల చేత పడిన నన్ను యెన్ని చిత్రహింసలకు గురి చేతురో సుమా ,
అనుభవించక తప్పదు చేసిన తప్పిదములకింకా ,
నరకయాతనలో నేనిక నలిగి ,కృంగి ,కృశించి పోయెద సుమా ,
జీవితంలో చేసిన తప్పిదాలకు తప్పించుకోలేరెవరు సుమా.
బిజ్జ నాగభూషణం