సంసారానుభూతి
అమృత వాక్కులు
సంసారానుభూతి.
మనిషికి ముందు సంసార సాగరం ఈదడం ముఖ్యం .తర్వాతే అంటే అరవై పైబడిన తర్వాతే ఆధ్యాత్మికం ,మోక్ష మార్గం మొదలవుతాయి .అందుకే పురాణాల్లో వుంది ,"కామి గాని వాడు మోక్ష కామి కాడు"".అంటే ముందు కామము అనుభవించాలి అంటే ఈ సంసార సాగరం ఈదాలి .తర్వాతనే మోక్షం కొరకు అర్హుడవుతాడు .భగవంతుడు మనిషికి స్వార్థం తోనే జన్మనిస్తాడు .
భగవంతుడు ప్రాణులకు కుటుంబం కలిగించాడు .పశుపక్షాదులకు కన్న తల్లీ ,తండ్రీ వారి గూడు వుంటాయి .మనము జన్మించగానే తల్లి తండ్రి కుటుంబంలో ఒకరివైపోతాము .తల్లి తండ్రి అక్కలు అన్నల ప్రేమానుభూతి ఆస్వాదిస్తాము .మనకు మాటలు వచ్చినప్పటినుంచి మనము కుటీమ్బీకులపై అనుభూతి చూపించడం మొదలు పెడతాము .మనకు పెంచడం ,చదివించడం ,కుటుంబీకున్ని తల్లి తండ్రి చేయడం సంసారానుభూతి .
పురాణాల్లో శ్లోకం,
"సంసార విష వృక్షస్య ద్వేఫలే అమృతోపమే ,
కావ్య మత రసాస్వాదః సజ్జనై సంగమస్సహః ".
అంటే సంసారమనే విష వృక్షమునుండి బయట పడడానికి ఒకటి సద్గ్రంత పఠనం ,రెండోది సత్పురుష సహవాసం చేయాలి .
సంసారానుభుతి ప్రతీ మనిషికి ఈ సంసార సాగరంలో కలుగుతుంది ,
ఒకటి మంచి అనుభూతి ,రెండవది చెడు అనుభూతి .
మంచి అనుభూతిని గ్రహించి జీవనం గడపడం ముఖ్యం .
బిజ్జ నాగభూషణం .