జ్ఞానం
అమృత వాక్కులు
జ్ఞానం -
ప్రతీ మనిషికి భగవంతుడు పుట్టుకతో ఇచ్చిన జ్ఞానం వుండనే ఉంటుంది .దాని పరిధిని మనుషులు వ్యాపింప చేసుకుంటారు .ఇది రెండు రకాలుగా చెప్పవచ్చు .
1)ప్రాపంచిక జ్ఞానం .
2)పారమార్థిక జ్ఞానం .
1)ప్రాపంచిక జ్ఞానం -మనిషి ప్రపంచంలో కుటుంబం ,సమాజం ,దేశం కొరకు ఉపయోగించే జ్ఞానాన్ని ప్రాపంచిక జ్ఞానం అంటారు .ఈ జ్ఞానం తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయి వరకు వుంటుంది .పేదవారికి తక్కువ స్థాయి లో వుంటుంది .ధనవంతులకు ఎక్కువ స్థాయి లో వుంటుంది .కీర్తి ప్రతిష్టలు గడించిన మహనీయులకు సర్వోన్నత స్థానంలో జ్ఞానం వుంటుంది .
2)పారమార్థిక జ్ఞానం -భగవంతుని సన్నిధి చేరడానికి అవసరమైన జ్ఞానం .ఈ జ్ఞానం కోసంమనిషి స్థబ్ధత నుంచి చైతన్య స్థితికి రావాలి .ఆ తర్వాత నిశ్చలత్వాన్ని సాధించాలి .అలాంటి నిశ్చల స్థితిలో బుద్ధి ,ఇంద్రియాలను నియంత్రిస్తుంది .మనిషిలోని మానసిక శక్తులన్నీ ఏకమౌతాయి .తద్వారా ప్రపంచంలోని జ్ఞాన మంతా ఆర్జించగలుగుతాడు .ఇలాంటి జ్ఞానం మనిషిలో ఆత్మజ్ఞానానికి దారి తీస్తుంది .ఆ ఆత్మజ్ఞానమే మనిషికి భగవంతుని వైపుమళ్లి భగవంతుని చేరే మార్గం అన్వేషిస్తుంది .ఇదే పారమార్థిక జ్ఞానం .
జ్ఞానాన్ని మూడు విధాలుగా చెప్పుకోవచ్చు .
1)విజ్ఞానం
2)సుజ్ఞానం
3)అజ్ఞానం .
1)విజ్ఞానం -మనిషి శాస్త్రాలను ,science లను అవలోకన చేసుకొని సంపాదించినది విజ్ఞానం .
2)సుజ్ఞానం -సత్సంగం అంటే మంచి జ్ఞానం కలిగిన సమూహం .ప్రపంచంలోని అన్ని మంచి విషయాలనే గ్రహించడం సుజ్ఞానం .
3)అజ్ఞానం -మనిషికి భగవంతుడు పుట్టుకతో ఇచ్చిన జ్ఞానం వుంటుంది .అయితే దాన్ని పెంపొందించుకోక.
"ఎక్కడ వేసిన గొంగలి అక్కడే "అన్న చందం ఇది .మనిషి పుట్టుకతో వచ్చిన జ్ఞానాన్ని కూడ అవసరాలకు ఉపయోగించుకోక పోవడం అజ్ఞానం అంటారు .
విజ్ఞానవంతులెవరంటే ఈ దేశంలో కీర్తి ప్రతిష్టలు పొందిన వ్యక్తులు ,బాబా సాహెబ్ అంబెడ్కర్ .సర్వేపల్లి రాధాకృష్ణ ,మోక్షగుండం విశ్వేశ్వరయ్య ,Dr అబ్దుల్ కలాం లాంటి వారు .
సుజ్ఞానులు ఎవరంటే ,స్వామి రామకృష్ణ పరమహంస ,స్వామి వివేకానంద ,ఆదిశంకరా చార్యులు ,రామానుజా చార్యులు ,శ్రీ రమణ మహర్షి లాంటి వారు .
అజ్ఞానులు ఎవరంటే మీ చుట్టు ప్రక్కల ,సమాజంలో వున్నవారు ఎవరో మీకు తెలుసు .
సర్వాంతర్యామి జ్ఞానస్వరూపుడు .సరస్వతీ ,దక్షిణామూర్తి ,గణపతి వీరు జ్ఞాన స్వరూపులు .వీరే ఈ లోకంలో మనుషులందరికి జ్ఞానప్రదాతలు .
బిజ్జ నాగభూషణం .