అనుమానం
అమృత వాక్కులు
అనుమానం -
ప్రతీ మనిషికి అనుమానం కలగడం సహజం .పెద్దలు ఏమన్నారంటే "అనుమానం పెనుభూతం " అని .అనుమానం వున్న మనిషి ఎ ప్రయత్నము చేయలేడు ,విజయాన్ని సాధించలేడు ,అన్యాయాన్ని ఎదుర్కోలేడు అని భగవత్ గీతలో వుంది .అనుమానం నివారణ చేసుకోవడం ముఖ్యం .లేకపోతే మనిషి అనుమానంతో కృంగి ,కృశించి చివరకు అంతమౌతాడు .అందుకే పురాణాల్లో వుంది "అందరిలో మంచిని చూడడం నీ బలహీనత ఐతే , ప్రపంచంలో నీ అంత బలవంతుడు ఇంకొకడు లేడు ".
అనుమానం రెండు రకాలు
1)ప్రతీది అనుమానించడం
2)అడపా దడపా అనుమానించడం .
1)ప్రతీది అనుమానించడం -కొందరికి ప్రతీది అనుమానించడం పుట్టుకతోనే వస్తుంది .పెద్దలన్నారు "పుట్టుకతో వచ్చింది పుడకలతో పోతుందని " అని .ఇలాంటివారు భార్యా పిల్లలను ,బంధువులను ,స్నేహితులను ,సమాజాన్ని అనుమానిస్తూవుంటారు .
2)అడపా దడపా అనుమానించడం -మనిషి అడపా దడపా అనుమానిస్తే ఫర్వాలేదు ,సర్ది చెప్పవచ్చు .వీరు వింటారు .మనుషులకిది సహజగుణం .దీని వల్ల పెద్ద నష్టమేమి జరగదు .
అలానే అనుమానం ,రెండు విధాలుగా చెప్పవచ్చు
1)వూహా జనితమైన అనుమానం
2)నిర్ధారణతో కలిగే అనుమానం .
1)వూహా జనితమైన అనుమానం -మనసులో మనిషి ఊహించుకొని ,తన ఊహలు ఆధార మైనా ,నిరాధారమైనవా చూడడు .ఇది కలగగానే అనుమానించడం మొదలుపెడతాడు .ఎవరైనా అతనికి ఆధారాలతో చెబితే అప్పుడు అనుమానం పటాపంచలై సాధారణ వ్యక్తి అవుతాడు .
2)నిర్ధారణలతో కలిగే అనుమానం -మనిషి ఎం చేస్తాడంటే ఇతడు ఈ మార్గంలో వెళుతున్నప్పుడు కృర జంతువులు ,దొంగలు ఆ మార్గంలో వున్నాయని వేరే వాళ్ళతో తెలుసుకొని ఇతడు గమ్యం చేరలేడని నిర్ధారణతో అనుమానిస్తాడు .
మనోవ్యాధికి మందు లేనట్టే మనిషి ఆలోచనలు సరైనవి కావని చెప్పినా వినరు చూశారా ,వారు మనోవ్యాధితో భాదపడుతన్నట్టు లెక్కే .మనిషి భగవంతుడు వున్నాడా లేడా అని అనుమానించే వారు వుంటారు .అనుమానంతో పూజలు చేయడం వ్యర్థం .భగవంతుని చేరే మార్గం కావాలంటే భగవంతుడు వున్నాడన్న నిశ్చయానికి రావాలి .అప్పుడు సాధన చేయాలి ,అప్పుడు సాకారం అవుతుంది .ఒక పని చేసే ముందు నేను చేయలేనని అనుమానం వస్తే ,జీవితంలో ఆ పని చేయలేడు .
అనుమాన రహితులే ,ప్రపంచంలో కృషి చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు ,మహనీయులవుతారు ,మహాత్ములౌతారు. చరిత్ర పుటలలో నిల్చిపోతారు .
బిజ్జ నాగభూషణం .