Online Puja Services

అభయ హస్తం (Promise )

3.140.197.140
అమృత వాక్కులు
అభయ హస్తం (Promise )
 
చాలా మంది దేవుళ్ళను చూస్తుంటాము ,వారు అభయ హస్తం తో వుంటారు.
 
శ్రీ మహావిష్ణువు ,శ్రీ రాముడు ,శ్రీ అభయ ఆంజనేయస్వామి ,శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా ఎందరో చెప్పుకోవచ్చు .శ్రీ మహావిష్ణువు అభయ హస్తం నిగూడార్ధం ఏమిటంటే ,శ్రీ మహావిష్ణువు అంటాడు ,ఈ సృష్టి కర్తను నేను ,మరి నేను సృష్టించిన 84 లక్షల ప్రాణులకు నేనే ఈ జగత్తులో అన్నీ చూసుకుంటాను .వారికి కళ్యాణం కలుగుగాక అని తను అభయహస్తంతో వుంటాడు .లోక కళ్యాణం దుష్ట శిక్షణ ,శిష్ట రక్షణ కూడా అందులో వుంది.
 
అంటే ఈ జగత్తులో పాపులను ,దుర్మార్గులను ,రాక్షసగుణాలు కలవారిని శిక్షిస్తాను .అలానే ఈ జగత్తులో దివ్యగుణాలైన దయ ,ప్రేమ ,సేవ ,పవిత్రత ,సత్యసంధతత ,నిర్భయత్వం ,పరోపకారార్థం ,ఓర్పు ,శాంతి ,సహనం ,క్షమ కల సత్పురుషుల ,వారిని నేను రక్షిస్తాను అని ఈ అభయ హస్తం యొక్క అర్థం .లోక కళ్యాణం అంటే ప్రజలకు అన్ని మంగళకరమైనవి కలిగిస్తాను అని కూడా అర్థం .మంగళకరమైనవి దేవుడు కల్పించడం వల్ల కొందరు దుర్మార్గపు బాట నుండి సన్మార్గపు బాట కు వచ్చే అవకాశం వుంది .భగవంతుణ్ణి "పుట్టిచ్చిన వాడు గిట్టిస్తాడంటారు ."అంటే మనకు జన్మనిచ్చిన ఆ భగవంతుడే మనకు అన్నపానాదులు కల్పించి రక్షిస్తాడని అర్థం .అంటే భగవంతుడు ఈ అభయ హస్తం ద్వార మీ రక్షణకు కావలసిన అన్నపానాదులు సమకూరుస్తానని అర్థం .
 
అలానే భగవంతుడు స్వయంభూ గ ఆలయాల్లో వెలసినప్పుడు విగ్రహంలో వుండే అభయ హస్తాన్ని ,అభయముద్ర అంటారు .కొన్ని చోట్ల భగవంతుడు అభయముద్రతోనే విగ్రహంగా వెలుస్తాడు .ఈ విగ్రహ ముద్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడ వుండి మీ బాగోగులు చూసుకుంటాను మీరు దిగులు పడనవసరం లేదు అని .శ్రీ కృష్ణ పరమాత్మ ,భగవత్ గీతలో ,మీరు అన్నీ వదిలిపెట్టి నన్ను శరణు చేరండి ,మీ పాపాలన్నింటిని పోగొట్టి ,మీకు మోక్షం ఇస్తానని అర్జనునికి అభయహస్తం తో చెప్తాడు అంటే ఇది అర్జనునికే కాదు మనకు భోధ .శ్రీ వెంకటేశ్వర స్వామి ,ఆపదల మొక్కుల వాడు ,అనాధ రక్ష అని వాడుకలో వున్నవి .అంటే అభయముద్రలో వున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ,నాకు మొక్కులు తీర్చండి మిమ్మల్ని ఆపదలనుండి గట్టెక్కిస్తానంటాడు .
 
శ్రీ అభయ ఆంజనేయ స్వామి ని అభయ హస్తంలో విగ్రహరూపంలో అందరు కొలుస్తారు ఎందుకంటే ఆయన అభయప్రదాత ,మొక్కిన వారికి అభయం ఇచ్చి వారికి ఆపదలనుండి రక్షిస్తాడని నమ్మకం .
 
శ్రీ రామచంద్రుడు తన అభయ హస్తం తో తన రాజ్యం లోని ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని ,అదే అభయహస్తం విగ్రహ రూపంలో వున్న శ్రీరామచంద్రుణ్ణి ఈ క్రింది శ్లోకం తో ప్రసన్నం చేసుకొని కోర్కెలు తీర్చుకుంటారు ,
 
శ్లోకం :
ఆపదా మపహర్తారం
దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం .
 
ఒకసారి శ్రీ కృష్ణుడు ప్రొద్దున్నే కర్ణుని ఇంటికి వెళ్ళినప్పుడు ,కర్ణుడు తలంటు కుంటుంటాడు వజ్రాలవైడూర్యాలు పొదిగిన గిన్నె నుండి నూనె తీసుకొని .శ్రీ కృష్ణుడు ఆ గిన్నెను ఇమ్మనగానే కర్ణుడు ఆ గిన్నెను ఇస్తాడు శ్రీ కృష్ణుడికి .అప్పుడు శ్రీ కృష్ణుడు సంతోషించి కర్ణునికి రెండు కోరికలు కోరుకో ఇస్తానంటాడు .అప్పుడు కర్ణుడు రెండింటిలో ఒకటి ఏమి కోరుకుంటాడంటే "నాదగ్గర దేహీ అని వచ్చి దానం అడిగినప్పుడు నేను వారికి ఇస్తానన్న అభయం నెరవేరేలా చూడు తర్వాత ఇవ్వలేననే పరిస్థితి నాకు ఈ జన్మలోనే కాదు నీవు నాకు ఇచ్చే అన్ని జన్మలకు కూడా వరమివ్వమంటాడు .
 
మనము అభయము ఇస్తుంటాము. అభయ హస్తం కాదు. ఒక గురువును శిష్యుడు అడుగుతాడు "What is the hardest and heaviest thing in the world.”గురువు చెబుతాడు శిష్యునికి "To Promise is the easiest thing in the world,but very difficult to fulfill that means it is hardest having heavyweight “.
 
మనము అభయం ఇచ్చేటప్పుడు సంతోషంగా వున్నప్పుడు ఇవ్వవద్దని పెద్దలంటారు .ఎందుకంటే సంతోషంలో తనతో ఇవ్వడం అవుతుందా కాదా అని ఆలోచించడు .ఇచ్చిన తర్వాత పశ్చాతాప పడతాడు .అయ్యో ఇవ్వాలే అని .
 
అభయం ఇవ్వడం చాలా తేలిక. ఎనకా ముందు ఆలోచించి ఇవ్వాలె. లేక పొతే ఇక్కట్లలో పడి ఇవ్వలేక మాట తప్పిన వారమని ముద్ర పడుతుంది .
 
మనము ఇచ్చే అభయ హస్తంతో మనము ఎదుటి వారికి ఇచ్చి వారి మన్నలను పొంది ఈ లోకంలో కీర్తి ప్రతిష్టలు పొంది మహనీయులమై వెలుగొందాలి .ఇతరులకు స్ఫూర్తి ప్రదాతగా నిలవాలి .
 
ఒక మాట -ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ,ప్రయత్నించనిదే విజయమూ దక్కదు - అబ్రహం లింకన్ .
 
బిజ్జ నాగభూషణం .
 

Quote of the day

Holding on to anger is like grasping a hot coal with the intent of throwing it at someone else; you are the one who gets burned.…

__________Gouthama Budda