వ్యత్యాసం
సంసారిక జీవితాన్ని కర్మయోగంగా భావించలేనివారికి/భావించేవారికి ఉన్న వ్యత్యాసం:
*******
సంసార జీవితాన్ని కర్మయోగంగా భావించలేని వారు., "నా" అనుకునేవాళ్లకు ఏదైనా జరిగితే కంగారుపడి తమ మానసిక ఆరోగ్యాలపై ప్రభావం చూపేలా చలిస్తారు., బాధతో ఢీలా పడిపోయి చేయాల్సింది మాత్రం చేయలేరు..
*******
సంసారిక జీవితాన్ని కర్మయోగంగా భావించేవారు బాధ్యతతో అడుగులేస్తారు. బాధను, వ్యామోహాన్ని, సున్నితమైన భావోద్వేగాలను దరిచేరనివ్వరు. "నా" అనుకునేవాళ్లకు ఏదైనా జరిగితే కంగారుపడకుండా.. వాళ్లను ఏవిధంగా పరిరక్షించాలో లేక తదుపరి తమ కర్తవ్య౦ ఏవిటో వివేకంతో అలోచించి.. తమవారికి చేయాల్సినవన్నీ శక్తికొద్దీ చేసేస్తారు.
*******
సాధనా రూపమైన యోగం సంసారిక జీవిత౦లో సైతం ఎవరూ చేయలేని విధంగా న్యాయం చేయగలుగుతుందని నా విశ్వాసం.
- ప్రహ్లాద్✍