దేవతలారా దీవించండి

దేవతలారా దీవించండి
ఓం శం నో మిత్రః శం వరుణః | శం నో భవత్వర్యమా | శం న ఇంద్రో బృహస్పతిః | శం నో విష్ణురురుక్రమః | నమో బ్రహ్మణే | నమస్తే వాయో | త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి | త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి | ఋతం వదిష్యామి | సత్యం వదిష్యామి | తన్మామవతు | తద్వక్తారమవతు | అవతు మామ్ | అవతు వక్తారమ్ || ఓం శాంతిః శాంతిః శాంతిః
మిత్రుడు మనకు శుభాన్ని కలుగజేయుగాక. వరుణుడు మనకు శుభాన్ని ఇచ్చుగాక, అర్యముడు మనకు శుభాన్ని కలిగించుగాక. ఇంద్రుడూ బృహస్పతీ మనకు శుభాన్ని కలుగజేస్తారుగాక. సర్వత్రా నెలకొని ఉన్న విష్ణువు మనకు శుభాన్ని కలిగిస్తాడు. గాక. బ్రహ్మమునకు నమస్కారము. వాయుదేవా, నీకు నమస్కరిస్తున్నాను. నువ్వే ప్రత్యక్ష దైవంగా ఉన్నావు. ప్రత్యక్ష దైవమని నిన్ను స్తుతిస్తున్నాను; ఋతమని స్తుతిస్తున్నాను; సత్యమని చెబుతున్నాను. ఆ పరబ్రహ్మం నన్ను రక్షించుగాక! ఆయన ఆచార్యుని రక్షించుగాక! నన్ను
రక్షిస్తాడుగాక! ఆచార్యుని రక్షిస్తాడు గాక!