ఆ దేవదేవుని ఆశీస్సులు - మనపై కలగాలంటే???

ఆ దేవదేవుని ఆశీస్సులు - మనపై కలగాలంటే???
ముందుగా మనకు త్రికరణ శుద్ధి కావాలి,
ఈరోజు మనం త్రికరణ శుద్ధిగా ఉన్నామా, లేదా అని ముందుగా, ఆలోచించుకోవాలి,
"నేడు మన మనస్సును, ఎలాంటి వాటిపై దృష్టి పెడుతున్నామో, చూసుకోవాలి!!!"
అనవసర విషయాలపై, పనికిమాలిన విషయాలపై, పెడుతున్నాము, ఇక భగవంతుని అనుగ్రహం ఎలా కలుగుతుంది???...
మితిమీరిన కోరికలు పెట్టుకుని, అవి తీరక , బాధలు పడుతూ ... తత్ఫలితంగా దేవుడు ఇచ్చిన పవిత్ర శక్తిని కోల్పోతున్నాము,
కోరికలు, కోపం మరియు అత్యాశ (కామ, క్రోధ మరియు లోభ) వంటి చెడు లక్షణాల కారణంగా దుఃఖానికి గురవుతున్నాము...
మనస్సుని నియంత్రించకపోతే కోరికలపై పూర్తిగా నియంత్రణ ఉండదు.
ఒక కోరిక నెరవేరితే మరొకటి కోరుతుంటారు, వీటికి అంతు ఉండదు! ...
కోపం అనేది మన జీవితాలను నాశనం చేసే మరొక చెడు లక్షణం, కోపంతో ఉన్న వ్యక్తి ఏ ప్రయత్నంలోనూ విజయం సాధించలేక పోతున్నాము...
నిరంతరం పాపాలు చేస్తుంటాము, అందరి చేత ఎగతాళి చేయబడతాము,
కోపం కంటే ద్వేషం ఇంకా ప్రమాదకరమైనది...
ఇది దైవత్వాన్ని అనుభవించే మార్గంలో అనేక ఆటంకములను పుట్టిస్తుంది... ఈ దుష్ట లక్షణాలను అధిగమించడానికి మనం ప్రయత్నం చేయాలి.
వీటిని మనలోనికి అనుమతించడం ద్వారా మృగంలా మారవద్దు...
మనము ఎప్పుడూ, మానవులమని నిరంతరం గుర్తు చేసుకోవాలి,
"మనస్సును పూర్తిగా దైవార్పణము చేయాలి, ధ్యానమో, జపమో, స్మరణయో మనకు అనుకూలంగా ఉన్న ఏదో ఒక సాధన మార్గమును ఎన్నుకొని ఆ మార్గంలో సాగిపొతే, తప్పనిసరి ఆ దేవ దేవుని ఆశీస్సులు సదా మన, ఇంటా వెంట, ఎల్లవేళలా ఉంటాయి."
- వాట్సాప్ సేకరణ