Online Puja Services

దేవుడు తెలివైనోడు.

18.191.81.46

దేవుడు తెలివైనోడు.
 
బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే, తీసి స్కూల్ లో వేస్తాడు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. 

స్కూల్ అయిపోయి కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాధ్యత గుర్తు చేస్తాడు. 

సరే  జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు.

డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే, లాగిపెట్టి ఒకటి పీకి, ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు. 

శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు భార్యని పంపిస్తాడు. 

సరే భార్యా-పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లల భవిష్యత్తు అంటాడు. 

పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే, ప్రేమని కోల్పోతున్నాం అని గుర్తు చేస్తాడు.

కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని మనిషి ఈ సారి దేవుడి మాట వినడు. 

కట్టల కొద్దీ పైసలు కూడబెడతాడు. హమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోడానికి ఎవరూ ఉండరు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. 

సరే పిల్లలకు పెళ్ళి చేసి, కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే, వాడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అని ఎక్కడికో ఎగిరిపోతారు. 

శక్తి మొత్తం క్షీణించి, ఏమీ చేయలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది. 
తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయ్. 

అప్పుడొస్తాడు దేవుడు, ఏడ్చింది చాలు నాయనా! 
నీ టైం అయిపోయింది వెళ్దాం పదా అని తీసుకెళ్లిపోతాడు. 

ఇదే సగటు మనిషి జీవితం.

- రమేష్ నాయుడు సువ్వాడ 

Quote of the day

The weak can never forgive. Forgiveness is the attribute of the strong.…

__________Mahatma Gandhi