మనశ్శాంతి
ఒకరోజు అనంతరావు పాటంకర్ అనే పండితుడు,
బాబాను చూడటానికి పూణే నుంచి వచ్చాడు.
బాబా దగ్గరకు వచ్చి
నేను అన్ని శాస్త్రాలు చదివాను
పురాణాలు పఠించాను
అయినా మనశ్శాంతి లేదు
అది లభిస్తుందేమోనని మీ దగ్గరకు వచ్చా అన్నాడు.
అప్పుడు బాబా చిరునవ్వు నవ్వి
నీకో కథ చెబుతాను
దానిలో మర్మాన్ని తెలుసుకుంటే
మనశ్శాంతి లభిస్తుంది అన్నాడు ......!!
నా దగ్గరకు ఒక వ్యాపారి వచ్చాడు
అతను తొమ్మిది బంతులను
తన దోతి అంచున కట్టుకొని వెళ్ళాడు
వాటి ద్వారా అతనికి మనశ్శాంతి లభించింది
అని చెప్పారు ......
ఆ కథ అర్థమేమిటో తెలియక
పాటంకర్ దాదా ... కెల్కర్ వద్దకు వెళ్ళాడు.
కేల్కర్ చిరునవ్వు -- నవ్వి
తొమ్మిది బంతులంటే --
తొమ్మిది రకాల భక్తి మార్గాలు * ఇవి *
శ్రవణము ( వినుట )
కీర్తన ( ప్రార్థించుట )
స్మరణ ( పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉండటం )
పాదసేవనం ( గురుపాదాలను సేవించుట )
అర్చన ( ఆరాదించుట )
నమస్కారం ( వందనం చేయుట )
దాస్యం ( సేవ చేయుట )
సఖ్యం ( స్నేహం చేయుట )
ఆత్మనివేదన ( తనను తాను అర్పించుకొనుట )
వీటిని ఎవరు పాటిస్తారో .........
వారికి మనశాంతి లభిస్తుంది అని వివరించాడు !!
ఓం శ్రీ సాయిరాం
మీ రాజు సానం