Online Puja Services

మనస్సును శుద్ధి చేసుకోవడం ఎలా...???

18.118.193.28

మనస్సును - శుద్ధి చేసుకోవడం ఎలా...???

భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః కుంభే సాంబ ! తవాంఘ్రి పల్లవ యుగం  సంస్థాప్య సంవిత్ఫలం, సత్త్వం మంత్ర ముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వహన పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం  కల్యాణ మాపాదయన్ !!

-- ఆదిశంకరుల వారు --

విశేషం - పుణ్యాహవాచనం :

ఇది యొక శుద్ధి కర్మ , ఇది చేసేటప్పుడు కలశము పెట్టి , దానికి దారముౘుట్టి
కలశములో నీళ్ళు పోసి  మామిడి చిగుళ్ళూ, కొబ్బరికాయనూ దానిపై ఉంచి మంత్రములు ౘదువుతూ, ఆ నీటితో గృహమును శుద్ధి చేసి, మంగళాన్ని పొందుతారు...

తాత్పర్యము :
ಓ సాంబమూర్తీ ! శివా ! నేను భక్తుడనై నా శరీరము అనే గృహాన్ని 
నిర్దుష్టంగా శుద్ధి చేసుకొని , మనస్సునకు ఇష్టమైన మంగళమును చేయడానికి పూనుకొని, దానికొఱకై భక్తి అనే నూలుపోగులను చుట్టి , సంతోషము అనే నీటితో నింపిన నామనస్సు అనే కలశంలో  నీ పాదములనే చిగుళ్ళనూ, 
జ్ఞానము అనే కొబ్బరి కాయను ఉంచి , కలశస్థాపనము చేసి , సత్త్వగుణ
రూపమైన తారకమంత్రాన్ని ఉచ్ఛరిస్తూ, పుణ్యాహవాచనమును నెరవేరుస్తాను.
( అన్ని వేళలా మీ పాదపద్మములను స్మరిస్తానని భావం )

వివరణ:

సామాన్యంగా మైలగానీ,పురుడుగానీ వచ్చి , ఇల్లూ ఇంట్లోని వారూ,
అశౌచంగా వుంటే , శుద్ధి రోజున తప్పకుండా గణపతి పూజ తోపాటు 
పుణ్యాహవాచనం చేసి ఆ కలశాలలోని పవిత్ర జలాన్ని  ఇల్లంతా చల్లాలి... ఇంటిలోని వారి శిరస్సులపైనా ౘల్లాలి. అప్పుడు ఆ ఇల్లూ ఇంటి యజమానీ , ఇంటిలోనివారూ నిర్మలులవుతారు...

 అలాగే భక్తుల,హృదయాలు అరిషడ్వర్గాలతో, అసూయాద్వేషాలతో , అపవిత్ర కార్య
క్రమాలతో మలినములైనపుడు ఏ విధంగా వారు తమ దేహాలను శుద్ధి
చేసుకోవాలో  ఈ శ్లోకంలో శంకరులు చెప్పారు...

శంకరులు ఇలా అన్నారు...

ಓ ఈశ్వరా ! నా శరీరం పాడుపడిన కొంప, దానిని శుద్ధి చేసుకోవాలి. తరువాత కల్యాణాన్ని ౘక్కగా సంపాదించాలి...
దానికై  పుణ్యాహం అనే శుద్ధి కర్మను చేసుకోవాలి, పుణ్యాహవాచన
కర్మకు కావలసిన సామగ్రిని నేను ఇలా సంపాదింౘుకుంటాను. 

ముందుగా కలశ స్థాపన చెయ్యాలి,  నామనస్సే ఆ కలశం.  
నామనస్సనే కలశం ప్రసన్నంగా 
స్వచ్ఛంగా వుంది... 

కలశానికి దారాలు ఛుట్టాలి, నేను నాభక్తి అనే దారాలు ఆ కలశానికి చుడతాను. 
నా సంతోషమనే నీటితో కలశాన్ని నింపుతాను...

కలశంలో లేత మామిడి చిగుళ్ళు వేయాలి కదా ! నీ పాదపద్మాలే నాకు 
దొరికిన ఆ చిగుళ్ళు...
అందుచేత నామనస్సనే కలశంలో  ఈశ్వరా ! 
నీ పాదాలనే చిగుళ్ళను వేస్తాను. 

ఇంక కలశంపై ఒక ఫలం ఉంచాలి...
నేను ఙ్ఞానం అనేే కొబ్బరికాయను కలశంపై ఉంౘుతాను.
 
తరువాత మంత్రాలు చదవాలి.  
నేను సత్త్వగుణ ప్రధానమైన తారకమంత్రాన్ని చదువుతాను. 

ఈ పుణ్యాహవాచనం వల్ల నా శరీరమూ, మనస్సూ, వాక్కూ పవిత్రమవుతాయి. 

ఉజ్జయినీ మహాకాలుని పంచామృత అభిషేకం మనం కూడా మనశరీర శుద్ధి, ఇలాగే  ఈశ్వర పాద ద్వంద్వాన్ని మన 
చిత్తంలో నిలిపి వాక్కుతో శివనామాన్ని జపించాలని,  
ఈ శ్లోకం ద్వారా శంకరులు మనకు సూచించారని మనం గ్రహించాలి, ఆచరించాలి.

- సేకరణ 

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya