రెండు మార్గాలు
లోకంలో మనిషి
నడుచుకునే మార్గాలు రెండున్నాయి,
వాటిలో ఒకటి ప్రేమో మార్గం రెండవది శ్రేయో మార్గం,
లౌకిక సుఖాల నిచ్చేది ప్రేమో మార్గం కాగా
మోక్షాన్ని లభింపజేసేది శ్రేయో మార్గం ......!!!
సామాన్యులకు ఈ రెండిటి మధ్యగల
భేదం తెలియదు
ప్రేమోమార్గం మొదట సుఖాన్ని కలిగించి
ఆ తర్వాత దుఃఖానికి కారణమౌతుంది
శ్రేయోమార్గం మొదట కష్టమైనప్పటికీ
చివరికది శాశ్వతమైన ఆనందానికి
హేతువౌతుంది
ఒక్కమాటలో చెప్పాలంటే ▪▪▪
.
సాంసారిక సుఖమే ప్రేమోమార్గం
ఆధ్యాత్మిక సుఖమే శ్రేయోమార్గం ,
సామాన్యులు ప్రేమోమార్గాన్ని అనుసరిస్తే
బుద్ధిమంతులు శ్రేయోమార్గంలో ప్రయాణిస్తారు
మనిషి ధనం మీద వ్యామోహం
చేత అవివేకి అవుతాడు , అవివేకం వల్ల
తనకు లభించిన సంపదంతా భగవంతుడిదని
తెలుసుకోలేక పోతాడు ఈ కారణంగానే
మాటిమాటికీ మృత్యువు పాలౌతాడు,
అనగా మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతాడు
లోకంలో ఎప్పుడు కూడా శ్రేయోమార్గం కంటే ప్రేమోమార్గంలో నడిచేవారే ఎక్కువుంటారు
ఎవరు శరీరం కంటే
భిన్నమైన ఆత్మను గూర్చి చెప్పగలరో
తెలుసుకోగలరో వారే అద్భుత వ్యక్తులు
ఆత్మ సూక్ష్మ పదార్థాలకంటే సూక్ష్మమైంది
ఆత్మ ఊహింప దగిందికాదు యథార్థమైంది
వేద విహితమైన కర్మలను ఫలాపేక్ష లేకుండా
చేసినప్పుడే ఆత్మ తత్వం బోధ పడుతుంది ,
ధ్యాన శీలుడైన విద్వాంసుడే తన మనస్సును
ఆత్మలో స్థిరంగా ఉంచగలుగుతాడు దీనికే
అధ్యాత్మ యోగం అని పేరు ........
ఈ యోగం ద్వారానే పరమేశ్వరుని
సాక్షాత్కారం లభిస్తుంది ...........!!!!!!!
ఓం నమః శివాయ
- నేను నా ఆలోచనలు