Online Puja Services

జ్ఞానిని అనుకరించరాదు

18.218.206.106

*ఎవరిని మీరు అను కరించాలి అంటే?* 

*ఒక జ్ఞానిని* మీరు అనుకరించలేరు, ఒక *అజ్ఞానినీ* మీరు అనుకరించ కూడదు.

*బాగా జ్ఞాపకం పెట్టుకోండీ ఈ విషయం* ... ఒక జ్ఞానిని అనుకరించలేరు,

ఒక భగవాన్ రమణులు గోచీ పెట్టుకొన్నారుగదాని మీరూ గోచి పెట్టుకుని ఆయలా తిరిగితే మీరు రమణ మహర్షి అవడం సాధ్యంకాదు.
భగవాన్ రమణులూ... ధ్యానంలో ఉండగా... ఆయన తొడలకింద తేళ్ళూ, జ్జెర్రులూ పట్టుకొని తొడలు కొరుక్కుతినేసి నెత్తురు కాల్వలై ప్రవహించినా... ఆయనకు శరీరమునందు సృతిలేదు. 

ఆయనలా గోచీ పెట్టుకోగలవేమో... ఆయనలా... నువ్వు ఆ స్థితిలో నిలబడిపోయి బాహ్మము నుంచి విడిపడిపోవడం నీకు సాధ్యమవుతుందా? 
జ్ఞానిని అనుకరించ వద్దూ... 

జ్ఞానిగా అయిన తరువాత, నీవు జ్ఞానివి కాగలిగితే... 
నీ స్థితి నీ కొస్తుందప్పుడు, తప్పా నీవు జ్ఞానివైపోయినట్టూ... 

రమననులులేలా ఉంటారో, 
రామకృష్ణ పరమహంస ఎలాఉంటారో, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఎలా ఉంటారో, 
ఒక చంద్రశేఖర భారతి ఎలా ఉంటారో అలా ఉండే ప్రయత్నం నీవు చేయకూడదు. అది సాధ్యమయ్యే విషయం కాదు.

చంద్రశేఖర భారతీ... 
పుష్పార్చన చేస్తూ... చేస్తూ... సమాధిలోకి వెళ్ళిపోయేవారు.
వెళ్ళిపోతే బిందెలతో నీళ్ళు తెచ్చి ఆయనమీద పోసేసేవాళ్ళు. ఆయనకు బాహ్య స్పుృతి ఉండేది కాదు. ఒళ్ళుతుడిచేసి బట్టలాగేసి, చుట్టేసేవారు. అలాగే ఉండేవారు. కొన్ని రోజులు అదే సమాది స్థితిలో ఉండేవారు. 

ఏదీ అలా నేను కూడా నటిస్తానండీ అంటే కుదిరే విషయమా! 
అది సాధ్యం కాదు.

జ్ఞానిని అనుకరించ రాదూ 
అనుకరించే ప్రయత్నమూ చేయ్యకూడదు. 
లేదా జ్ఞానిని అనుకరించలేవు. అజ్ఞానినీ... అనుకరించరాదు. 

జ్ఞానీ సంధ్యావందనం చేయకపోవచ్చూ,
జ్ఞానీ బట్టకట్టకపోవచ్చు, 
ఒక అజ్ఞానీ బట్ట కట్టకపోవచ్చూ, తండ్రికి తద్దినం పెట్టకపోవచ్చూ, 
వాడు చేస్తున్నాడని నీవు చేయకూడదు. 

ఈ రెండిటికి మధ్యలో నీ పరిధి తెలుసుకొని నీవు ప్రవర్తిస్తే పైకి ఎక్కుతావు, 
ఈ ఎక్కేటటువంటి ప్రస్తానమునకు *సాధన* అని పేరు. 

అజ్ఞానికి చూసి అలా చేయకుండా ఉండడం, 
జ్ఞానిని అనుకరుంచే ప్రయత్నం చేయకపోవడం, 
అజ్ఞానిచూసి వాడు బాగుపడాలని కోరుకొనీ, 
నీవు జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేయడానికి నిశ్ఛలమైన చిత్తంతో కర్మాచరణం చేసేటటువంటి ప్రక్రియకు *సాధనా* అని పేరు శాస్త్రంలో. 

- నాగార్జున పాణ్యం 

Quote of the day

There are only two mistakes one can make along the road to truth; not going all the way, and not starting.…

__________Gautam Buddha